Home > అంతర్జాతీయం > యూట్యూబ్ వీడియో చూసి తలకు బొక్క పెట్టుకున్నాడు..ఎందుకో తెలుసా?

యూట్యూబ్ వీడియో చూసి తలకు బొక్క పెట్టుకున్నాడు..ఎందుకో తెలుసా?

యూట్యూబ్ వీడియో చూసి తలకు బొక్క పెట్టుకున్నాడు..ఎందుకో తెలుసా?
X

సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని సునాయాసంగా తెలుసుకోగలుగుతున్నాము. ఎన్నో తెలియని విషయాలను నేర్చుకుంటున్నాము. మరీ ముఖ్యంగా నేటితరం యువత తమ కెరీర్‎కు అవసరమైన టెక్నాలజీని , స్కిల్స్‎ను యూట్యూబ్‎లోని విడియోలను చూసి నేర్చుకుంటున్నారు. సరికొత్త బిజినెస్ ఐడియాలను, స్టడీ మెటీరియల్‎ను, ప్రజెంటింగ్ స్కిల్స్‎ను , పలు భాషలను ఈ యూట్యూబ్ వీడియాలను చూసే నేర్చుకుంటున్నారు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకొందరు వీడియోలను చూసి ఏకంగా ఏ మాత్రం అనుభవం లేకుండా సొంతంగా వైద్యం చుసుకుంటారు. ఇలాంటి ఘటనలు బెడిసికొట్టి ప్రాణాల మీదికి తెచ్చుకున్నవారి లిస్ట్ చాలానే ఉంది. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది.

నిద్రలో కలలను నియంత్రించేందుకు ఓ వ్యక్తి ఏకంగా పెద్ద సాహసమే చేశాడు. తన బుర్రలో ఓ చిప్ పెట్టుకునేందుకు తలకు బొక్కపెట్టుకున్నాడు. ఆ ప్రయోగం కాస్త వికటించడంతో చావు అంచుల వరకు వెళ్లాడు.

యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఈ సంఘటన రష్యాలో జరిగింది. కజకిస్థాన్‌లో సెటిల్ అయిన 40 ఏళ్ల మిఖాయిల్‌ రాదుగా ఈ ప్రయోగాన్ని చేశాడు. మిఖాయిల్‌‏ను ప్రతి రోజు రాత్రి నిద్రలో కలలు వేధించేవట. వాటిని ఎలాగైనా కంట్రోల్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. యూట్యూబ్‎లో ఇందుకు సంబంధించి అనేక వీడియోలను చూశాడు. బ్రెయిన్‎లో చిప్ పెట్టుకుంటే కలలను నియంత్రిచొచ్చని నిర్ణయానికి వచ్చాడు. ఈ సర్జరీ కోసం న్యూరో సర్జన్లను సంప్రదించాడు.

అయితే, వైద్యులు అందుకు నిరాకరించారు. ఇక లాభం లేదనుకున్న మిఖాయిల్‌ స్వయంగా ఆపరేషన్ చేసుకోవాలనుకున్నాడు. యూట్యూబ్‎లో చెప్పినట్లుగా

ఒక డ్రిల్లింగ్ మిషన్ కొనుగోలు చేశాడు. దాంతో తలకు బొక్క పెట్టుకున్నాడు. ఓవైపు రక్తం కారుతున్నప్పటికీ ఏమాత్రం లెక్కచేయకుండా తలలో ఎలక్ట్రోడ్ చిప్‌ను ఫిక్స్ చేసుకున్నాడు. దాదాపు 4 గంటల పాటు ఈ ప్రయోగం చేశాడు. ఇందులో భాగంగా తీవ్ర రక్తస్త్రావం అయ్యింది. దాంతో అతను ప్రాణాపాయంలో పడ్డాడు. అయితే, అతని అదృష్టం బాగుండి..స్థానికులు అతడిని హాస్పిటల్‎కు తరలించారు. వైద్యులు చికిత్స అందించడంతో పెద్ద ఆపద నుంచి బయటపడ్డాడు.








Updated : 22 July 2023 12:51 PM IST
Tags:    
Next Story
Share it
Top