Home > అంతర్జాతీయం > బాబోయ్.. యవ్వనంగా కనిపించేందుకు ఏటా రూ.16కోట్ల ఖర్చు

బాబోయ్.. యవ్వనంగా కనిపించేందుకు ఏటా రూ.16కోట్ల ఖర్చు

బాబోయ్.. యవ్వనంగా కనిపించేందుకు ఏటా రూ.16కోట్ల ఖర్చు
X

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన 45 ఏళ్ల బ్రియాన్‌ జాన్సన్‌ (Bryan Johnson).. యవ్వనంగా కనిపించేందుకు తెగ కష్టపడుతున్నాడు. రాత్రి 8.30గంటలకే పడుకోవడం, ఉదయం 6గంటల నుంచి 11గంటలలోపు కేవలం 2250 కెలోరీలనిచ్చే ఆహార పదార్థాలను తినడం, ఏకాగ్రత కోసం నాలుగు నుంచి ఐదు గంటలు కేటాయించడం, 18 ఏళ్ల వయస్సులో తాను ఎలా కనిపించేవాడో తిరిగి ఆ రూపం తెప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందుకోసం ఓ డాక్టర్ల బృందం అతడి కోసం స్పెషల్ గా ట్రీట్మెంట్‌ను సైతం అందిస్తోంది. ఈ స్పెషల్ ట్రీట్మెంట్ కోసం ఏడాదికి సుమారు రూ.16కోట్లు ఖర్చు చేస్తున్నాడట మనోడు. శరీర దారుఢ్యం, ఊపిరితిత్తుల సామర్థ్యం, గుండె పని తీరు, చర్మం నిగారింపు వంటివి యవ్వనంలో ఉన్న వ్యక్తిలో ఉండేలా కనిపిస్తున్నాయని అంటున్నాడు.

అందం , ఆస్తి, సకల సౌకర్యాలున్నా.. డేటింగ్ కోసం పార్టనర్ దొరకట్లేదని ఫీల్ అవుతున్నాడు. ఆయన పెట్టిన 10 కండీషన్లు చూసి ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదట. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో తన అనుభావాలను పంచుకున్నాడు. ప్రస్తుతం ఒంటరిగానే ఉన్నానని, భాగస్వామి దొరకడం కష్టమైన విషయం వాస్తవమేనని అంగీకరించాడు. ఒకవేళ పార్టనర్ దొరికినా తనకు దూరంగానే ఉంటానని పెద్ద బాంబే పేల్చాడు బ్రియాన్‌. అందుకు ఓ కారణాన్ని కూడా చెప్పుకొచ్చాడు. తాను ముడుచుకొని పడుకోవడం అలవాటు చేసుకున్నానని, భాగస్వామితో ఉన్నప్పుడు అలా పడుకోలేనని, అదెంతో సవాలుతో కూడుకున్నదని అంటున్నాడు. ఇక ఇదివరకు మద్యం సేవించే అలవాటు ఉన్నదని... అదనపు కెలోరీలు వస్తున్నందున దానికి దూరంగా ఉంటున్నానని చెప్పాడు. అంతేకాదు.. రోజుకు దాదాపు 111 టాబ్లెట్స్‌ వేసుకుంటానని వివరించడం గమనార్హం.





Updated : 16 Aug 2023 7:59 AM IST
Tags:    
Next Story
Share it
Top