Home > అంతర్జాతీయం > అందాల పోటీల్లో సంచలనం..ట్రాన్స్‌జెండర్‌‎కు కిరీటం

అందాల పోటీల్లో సంచలనం..ట్రాన్స్‌జెండర్‌‎కు కిరీటం

అందాల పోటీల్లో సంచలనం..ట్రాన్స్‌జెండర్‌‎కు కిరీటం
X

అందాల పోటీలల్లో ఓ ట్రాన్స్‌జెండర్‌ సంచలనం సృష్టించింది. చరిత్రలోనే తొలిసారి అందాల కిరీటాన్ని అందుకుని విజేతగా నిలిచింది.

ఇదివరకు ఏ ట్రాన్స్‌జెండర్‌ సాధించలేని ఘనతను తన ఖాతాలో వేసుకుంది. అయితే ట్రాన్స్​జెండర్​కు అందాల కిరీటాన్ని పొందడంపై కొంత మంది హర్షం వ్యక్తం చేస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు.

సాధారణంగా అందాల పోటీల్లో అమ్మాయిలు పాల్గొంటారు కానీ ఇక్కడ మాత్రం 22 ఏళ్ల డచ్ మోడల్ రిక్కీ వాలెరీ కొల్లె ట్రాన్స్​జెండర్​ అందాల పోటీల్లో పాల్గొనడమే కాదు టైటిల్‎ను సైతం సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. శనివారం ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన అందాల పోటీల్లో రిక్కీ ఇరగదీసింది. ఈ పోటీల్లో తనతో పోటీపడిని అందగత్తెలందరినీ పక్కకు నెట్టి తన అందాలతో అందరినీ అట్రాక్ట్ చేసింది. జడ్జులు కూడా ఆమె అందాలకు ఫిదా అయ్యి మిస్‌ నెదర్లాండ్స్‌గా టైటిల్‎ను అందించారు.





ఈ చారిత్రత్మక విజయం 72వ మిస్‌ యూనివర్స్‌ టైటిల్‌కు పోటీదారుగా తన స్థానాన్ని పదిలం చేసింది. తన విజయాన్ని తలచుకుంటూ ట్రాన్స్‌జెండర్‌ భావోద్వేగానికి గురైంది. నా కమ్యూనిటీని గర్వించేలా చేసినందుకు చాలా ఆనందంగా ఉందని ఎమోషనల్ అయ్యింది. "అందాల కిరీటాన్ని పొందేందుకు అనుక్షణం తపనపడ్డాను. ఈ విజయం నాకు ఎంతో ముఖ్యం. నా గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నా లాంటి ఎంతో మంది ట్రాన్స్​జెండర్లకు నేను రోల్ మోడల్‎గా ఉండాలనుకుంటున్నాను. మా పై సమాజంలో ఉన్న తప్పుడు ఆలోచనలకు, వివక్షకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇది ఒక అవకాశంగా భావిస్తాను. సమాజంలో మార్పు తీసుకురావడం, తమలాంటి వారికి ఎలాంటి సమస్యలు లేకుండా చేయడమే తన లక్ష్యం" అని అంటోంది అందాల భామ రిక్కీ.













Updated : 11 July 2023 10:06 AM IST
Tags:    
Next Story
Share it
Top