Home > అంతర్జాతీయం > ట్రక్కు బీభత్సం.. 48మంది మృతి

ట్రక్కు బీభత్సం.. 48మంది మృతి

ట్రక్కు బీభత్సం.. 48మంది మృతి
X

కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్‌ అదుపుతప్పి ఇతర వాహనాలను ఢీ కొనడంతోపాటు పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 48 మంది మృతి చెందగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

కెరిచో- నకురు పట్టణాల మధ్య హైవేపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై అధిక వేగంతో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి 8 వాహనాలను, బైక్‌లను, పాదచారులను ఢీకొట్టింది. లోండియాని జంక్షన్ రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. పలు వాహనాల శిథిలాలు, బోల్తా పడిన ట్రక్కు కింద కార్మికులు చిక్కుకుపోయారని పోలీసులు చెబుతున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇక, ఈ ప్రమాదం ఘటనపై కెన్యా అధ్యక్షుడు విలియం రూటో సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.





Updated : 1 July 2023 9:35 AM IST
Tags:    
Next Story
Share it
Top