Home > అంతర్జాతీయం > Canada India: భారత జర్నలిస్ట్ ప్రశ్నలకు ముఖం చాటేసిన కెనడా

Canada India: భారత జర్నలిస్ట్ ప్రశ్నలకు ముఖం చాటేసిన కెనడా

Canada India: భారత జర్నలిస్ట్ ప్రశ్నలకు ముఖం చాటేసిన కెనడా
X

భారత్- కెనడా మధ్య వైరం రోజు రోజుకు ముదురుతుంది. ఖలిస్తాన్ వేర్పాటువాద ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో కెనడా, భారత ప్రభుత్వాల మధ్య రేగిన వివాదానికి ఇప్పట్లో తెరపడేలా లేదు. ఎదుటి దేశపు రాయబారులను పరస్పరం బహిష్కరిచుకున్న రెండు దేశాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనకు భారత్‌ను రెచ్చగొట్టే ఉద్దేశం లేదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అంటూనే.. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా ఐక్యరాజ్య సమితి వేదికపై భారత్-కెనడా మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులపై మాట్లాడటానికి ప్రధాని జస్టిన్ ట్రూడో నిరాకరించారు. భారత జర్నలిస్ట్ (పీటీఐ) ప్రశ్నిస్తుంటే ముఖం చాటేసుకుని వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఐక్యరాజ్య సమితి 78వ సమావేశాలకు ట్రూడో హాజరయ్యారు. సమావేశాల్లో వాతావరణ, ఉక్రెయిన్ అంశాలపై భద్రతా మండలిలో మాట్లాడారు. ఈ క్రమంలో రెండు సందర్భాల్లో పీటీఐ ట్రూడోను ప్రశ్నించింది. ట్రూడో ఆరోపణలను భారత్ ఖండించిన విషయంపై ప్రశ్నించగా.. వాటికి ఏ మాత్రం స్పందించకుండా ముందుకు వెళ్లిపోయారు. దీంతో కెనడా ప్రధాని కావాలనే భారత్ పై ఆరోపణలు మోపుతున్నారని, ఈ విషయంలో ఆయనకే ఏ మాత్రం క్లారిటీ లేదని అంటున్నారు. అందుకే మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి ధైర్యం చేయట్లేదంటే విమర్శిస్తున్నారు.





Updated : 21 Sept 2023 4:48 PM IST
Tags:    
Next Story
Share it
Top