Home > అంతర్జాతీయం > అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో దూసుకెళ్తున్న ట్రంప్‌

అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో దూసుకెళ్తున్న ట్రంప్‌

అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో దూసుకెళ్తున్న ట్రంప్‌
X

రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి కోసం డోనాల్డ్ ట్రంప్ గట్టిగా పోటీ ఇస్తున్నారు. రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ట్రంప్ తన జోరు చూపిస్తున్నారు. తాజాగా జరిగిన దక్షిణ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లోనూ ఆయన గెలిపు నమోదు చేసుకున్నారు. అయితే అటు సొంత రాష్ట్రంలోనూ నిక్కీ హేలీకి ఓటమి తప్పలేదు. ఇప్పటికే న్యూ హాంప్‌షైర్‌, నెవడా, ఐయోవా, వర్జిన్‌ ఐలాండ్స్‌లో ట్రంప్‌ విజయం సాధించారు. అయినప్పటికి హేలీ పోటీ నుంచి తప్పుకోడానికి అంగీకరించడం లేదు. మార్చి 5న పలు రాష్ట్రాల్లో జరిగే ప్రైమరీల్లోనూ తాను రేసులో పాల్గొంటానని తెలిపారు. ప్రస్తుత ఫలితాల ప్రకారం రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌, ట్రంప్‌ మధ్య మరోసారి హోరాహోరీ పోటీ తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి.

రిపబ్లికన్‌ పార్టీ ఇప్పుడున్నంత ఐక్యంగా మునుపెన్నడూ లేదని ట్రంప్‌ అన్నారు. తాజాగా విజయం సాధించిన తర్వాత మద్దతుదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. చాలా కాలం నుంచి దక్షిణ కరోలినాలో రిపబ్లికన్లకు మంచి పట్టుందని తెలిపారు. అయితే గతంలో నిక్కీ హేలీ ఈ రాష్ట్రానికి గవర్నర్‌గా సేవలు అందించారు. అయినప్పటికీ.. తాజా ప్రైమరీలో ఆమెకు మద్దతు కరువైంది. గవర్నర్‌గా ఆమె చాలా మంచి పనులు చేసినప్పటికీ.. జాతీయ స్థాయి వ్యవహారాలను మాత్రం ఆమె ట్రంప్‌ కంటే మెరుగ్గా నిర్వహించలేరని కొంత మంది అభిప్రాయపడ్డారు.

Updated : 25 Feb 2024 7:41 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top