Home > అంతర్జాతీయం > భారత్పై ప్రతీకారం తీర్చుకుంటా: ట్రంప్

భారత్పై ప్రతీకారం తీర్చుకుంటా: ట్రంప్

భారత్పై ప్రతీకారం తీర్చుకుంటా: ట్రంప్
X

అమెరికా అధ్యక్షుడిగా మరోసారి పగ్గాలు చేపట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. మరోసారి భారత్ పన్ను అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి.. భారత్పై తీవ్ర ఆరోపణలు చేశారు. భారత్ కొన్ని అమెరికా ఉత్పత్తులపై భారీ పన్ను విధిస్తోందని మండిపడ్డారు. 2024 ఎన్నికల తర్వాత తాను అధ్యక్షుడిగా గెలిస్తే.. ఢిల్లీపై ప్రతీకార పన్ను విధిస్తామని హెచ్చరించారు. 2019లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న టైంలో భారత్ను ‘టారిఫ్ కింగ్’ అని పిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్కు జీఎస్పీ (జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌) రద్దు చేశారు. జీఎస్పీ అంటే.. అభివృద్ధి చెందుతున్న దేశాలు పన్ను రహిత ఎగుమతులు చేసుకోవడానికి వీలుంటుంది.

‘అమెరికా ఉత్పత్తులకు భారత్ 200 శాతం పన్ను వసూలు చేస్తుంది. కానీ మనమెందుకు భారత్ నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయకూడదు? మనం కడుతున్నామంటే వాళ్ల నుంచి కూడా వసూలు చేయాలి. 2024లో నన్ను గెలిపించండి. భారత్పై ప్రతీకార పన్ను విధిస్తా’ అని ట్రంప్ అన్నాడు. గతంలో కూడా ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు భారత్కున్న ఈఎస్పీ హోదాను తొలగించారు.




Updated : 21 Aug 2023 4:38 PM IST
Tags:    
Next Story
Share it
Top