Great Wall of China : దారికి అడ్డంగా ఉందని.. 'గ్రేట్‌వాల్ ఆఫ్ చైనా'నే తవ్వేశారు
X
చారిత్రక కట్టడం ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ (Great Wall)ను ఇద్దరు వ్యక్తులు తవ్వేశారు . ఈ ఘటన చైనా(China)లోని ఉత్తర షాక్సి ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. గ్రేట్ వాల్‌లోని ఒక భాగాన్ని బుల్డోజర్ తో తవ్వేందుకు ప్రయత్నించారు. విషయం వెలుగులోకి రావడంతో ఆ ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ టౌన్ షిప్ నుంచి ఒక అడ్డదారిని తయారు చేసేందుకు.. అడ్డుగా ఉన్న చారిత్రక కట్టడం గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఏరియాలో తవ్వకాలు చేపట్టినట్లు నిందితులు అంగీకరించారు. చైనాలోని ఉత్తర షాక్సి ప్రావిన్స్ యూయు కౌంటీ లోని యాంగ్‌క్యాన్హె టౌన్‌షిప్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ 38 ఏళ్ల వ్యక్తి, 55 ఏళ్ల మహిళ కలిసి ఆగస్టు 24న యంత్రాల సాయంతో గ్రేట్‌వాల్‌ను తవ్వేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది. రిపినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మార్గంలో షార్ట్‌కట్ దారిని క్రియేట్ చేసేందుకే ఇలా తవ్వకాలు జరిపామని ఆ ఇద్దరు వ్యక్తులు చెప్పడంతో అధికారులు షాక్ కు గురయ్యారు.
ప్రపంచంలోనే పేరొందిన 21,196 కిలోమీటర్ల ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ సమగ్రత, సుస్థిరతకు వీరు తీవ్ర నష్టం చేశారని ఆఫీసర్లు చెప్పారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లలో ఒకటైన గ్రేట్‌వాల్ కు నష్టం కలిగేలా చేశారని వాపోయారు. తవ్వకాలు జరిపిన ఇద్దరు వ్యక్తులను నిర్మాణ పనిని కాంట్రాక్టుకు తీసుకున్న వారిగా గుర్తించారు. తవ్వకాలు జరిపిన ప్రాంతంలో ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ను 32 గ్రేట్‌వాల్ అని పిలుస్తారు. 1368-1644 సమయంలో మింగ్ వంశీయులు గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను (Great Wall of China) నిర్మించారు.1987లో గ్రేట్ వాల్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది