Home > అంతర్జాతీయం > రెండు విమానాలు ఢీ.. 15 రోజుల్లో రెండో ఘటన

రెండు విమానాలు ఢీ.. 15 రోజుల్లో రెండో ఘటన

రెండు విమానాలు ఢీ.. 15 రోజుల్లో రెండో ఘటన
X

జపాన్లో వరుస విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. 15 రోజుల్లోనే రెండు ప్రమాదాలు జరిగాయి. జనవరి 2న రెండు విమానాలు ఢీకొనగా.. ఘోర ప్రమాదం జరిగింది. తాజాగా అటువంటి ఘటనే మళ్లీ జరిగింది. న్యూచిటోస్ ఎయిర్ పోర్టులో రన్ వేపై రెండు విమానాలు ఢీకొన్నాయి. ఎయిర్ పోర్టులో ఆగివున్న కాథే పసిఫిక్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానాన్ని కొరియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ ఢీకొట్టింది. కొరియన్ ఎయిర్ లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాద సమయంలో విమానంలో 289మంది ఉన్నారు. కాథే ఫ్లైట్లో మాత్రం ప్రయాణికులు లేరు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు స్పష్టం చేశారు. జనవరి 2న టోక్యోలోని హనెడా ఎయిర్ పోర్టులో రెండు విమానాలు ఢీకొనడంతో భారీ ప్రమాదం జరిగింది. జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జేఏఎల్‌ 516 విమానం హనెడా ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతున్న సమయంలో కోస్టు గార్డు విమానాన్ని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కోస్టుగార్డు విమానంలో ఉన్న అయిదుగురు సిబ్బంది మరణించారు.

Updated : 16 Jan 2024 7:51 PM IST
Tags:    
Next Story
Share it
Top