UK PM Rishi Sunak : తరగతి గదుల్లో మొబైల్ ఫోన్లు నిషేధం.. బ్రిటన్ ప్రధాని సంచలన నిర్ణయం
X
ప్రస్తుత కాలంలో ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోనే. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరు మొబైల్స్ ఫోన్స్ వాడుతూ టెక్నాలజీతో కనెక్ట్ అవుతున్నారు. అవసరం ఉన్నా లేకున్నా.. గంటల తరబడి స్మార్ట్ ఫోన్లతోనే రోజుల్ని గడుపుతున్నారు. ఆఫీసులు, కాలేజీలు, స్కూళ్లలో కూడా ఫోన్లలను వాడటం కామన్ గా మారింది. విద్యార్థులు కూడా ఫోన్స్ కు అతుక్కుపోతూ చదువులను పెద్దగా పట్టించుకోవడం లేదు.ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని రుషి సునక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల్లో మొబైల్ ఫోన్‌ల వినియోగాన్ని నిషేదించారు.
మొబైల్ ఫోన్‌ల వల్ల పిల్లలపై పడే ప్రభావాన్ని వివరిస్తూ బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్ సోమవారం సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. తరగతి గదుల్లో ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు మొబైల్ ఫోన్‌లను నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘మొబైల్ ఫోన్‌లు చాలా ప్రభావం చూపుతున్నాయి. సెకండరీ స్కూల్ విద్యార్థుల్లో మూడింట ఒకవంతు మంది తమ పాఠాలకు ఫోన్‌ల వల్ల అంతరాయం కలుగుతుందని చెప్పారు. ఫోన్‌ల కారణంగా తరగతి గదిలో వారు చదువుపై దృష్టి సారించడం లేదు. చాలా పాఠశాలలు ఇప్పటికే ఫోన్‌లను నిషేధించాయి. దేశవ్యాప్తంగా ఇది పాటించాలి’ అని రిషి సునక్ వీడియోలో చెప్పారు.
We know how distracting mobile phones are in the classroom.
— Rishi Sunak (@RishiSunak) February 19, 2024
Today we help schools put an end to this. pic.twitter.com/ulV23CIbNe
విరామ సమయాలతో సహా పాఠశాలల్లో మొబైల్ ఫోన్‌లను నిషేధించాలని బ్రిటన్ ప్రభుత్వం ఫిబ్రవరి 19న కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఉపాధ్యాయుల కోసం కూడా ప్రత్యేక మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. విద్యార్థులకు సురక్షితమైన మరియు మెరుగైన విద్యా వాతావరణానికి ఇది ఉపయోగంగా ఉండనుంది. మొబైల్ ఫోన్ల ద్వారా ఉత్పత్తి అయ్యే రేడియేషన్‌లకు కూడా దూరంగా ఉండొచ్చు.