Home > అంతర్జాతీయం > ఢిల్లీ డిక్లరేషన్‌పై ఉక్రెయిన్ వెటకారం.. ఎర్ర రంగుతో మరీ...

ఢిల్లీ డిక్లరేషన్‌పై ఉక్రెయిన్ వెటకారం.. ఎర్ర రంగుతో మరీ...

ఢిల్లీ డిక్లరేషన్‌పై ఉక్రెయిన్ వెటకారం.. ఎర్ర రంగుతో మరీ...
X

ఢిల్లీ వేదికగా జీ20 దేశాలు శనివారం ప్రకటించిన డిక్లరేషన్‌ను ప్రపంచ దేశాలు స్వాగతిస్తున్నాయి. విద్వేషం మరిచి అభివృద్ధి కోసం కృషి చేద్దామన్న పిలుపును పాటిస్తామన్నాయి. వర్తమాన ప్రపంచ ఆకాంక్షలకు ఇది అద్దం పడుతోందంటున్నాయి. అయితే ఉక్రెయిన్ మాత్రం డిక్లరేషన్ విమర్శలు సంధించింది. తమను నాశనం చేస్తున్న యుద్ధంపై జీ20 దేశాలు ఉద్దేశపూర్వకంగా దారితప్పించే ప్రకటన చేశాయని మండిపడింది. డిక్లరేషన్‌లో యుద్ధం గురించిన వాక్యాలు బాలేవంటూ వాటిని ఎర్రరంగుతో సరిదిద్ది, అలా ఉండుంటే బావుండేదని ఎద్దేవా చేసింది.

ఈమేరకు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఒలెగ్ నికోలెంకో చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. రష్యా పేరును ప్రస్తావించకుండా ప్రకటన చేయడంలో గొప్ప ఏముందని ఆయన నిలదీశారు. పదాలను నేర్పుగా కూర్చారని, తమ దేశానికి సదస్సులో పాల్గొనే అవకాశం కల్పించివుంటే యుద్ధ పరిస్థితిని వివరించేవాళ్లమని అన్నారు. సదస్సుకు ఆతిథ్యమిచ్చిన భారత్ ప్రతిపాదించిన ఢిల్లీ డిక్లరేషన్‌లో వాస్తవాలను చెప్పలేదంటూ ఆయన కరెక్షన్ చేసిన డిక్లరేషన్ వాక్యాలను ట్వీట్ చేశారు. ‘ఉక్రెయిన్ లో సాగుతున్న యుద్ధం’ అనే వాక్యాన్ని ‘ఉక్రెయెన్‌పై చేస్తున్న యుద్ధం’ అని మార్చారు. ‘అన్ని దేశాలు ఐరాస ఒప్పందం ప్రకారం నడుచుకోవాలి’ అన్న వాక్యాన్ని ‘రష్యా అలా నడచుకోవాలి’ అని దిద్దారు.




Updated : 9 Sept 2023 9:41 PM IST
Tags:    
Next Story
Share it
Top