Home > అంతర్జాతీయం > జెలెన్‌స్కీకి గట్టి షాక్.. అధ్యక్షుడి ఊరిపై బాంబులు కురిపించిన రష్యా

జెలెన్‌స్కీకి గట్టి షాక్.. అధ్యక్షుడి ఊరిపై బాంబులు కురిపించిన రష్యా

జెలెన్‌స్కీకి గట్టి షాక్.. అధ్యక్షుడి ఊరిపై బాంబులు కురిపించిన రష్యా
X

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కి గట్టి షాక్ తగిలింది. ఇకపై రష్యా భూభాగంలోనే యుద్ధమని జెలెన్‌ స్కీ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే... ప్రతీకార దాడి అన్నట్టుగా రష్యా బాలిస్టిక్‌ క్షిపణులు ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డాయి. జెలెన్‌స్కీ స్వస్థలం సెంట్రల్‌ ఉక్రెయిన్‌లోని క్రివి రిహ్‌లో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌, ఒక యూనివర్సిటీ భవనంపైకి క్షిపణుల దాడి జరిగింది. ఈ దాడిలో ఆరుగురు మరణించగా 75 మంది గాయపడ్డారు. చనిపోయినవారిలో పదేళ్ల చిన్నారి కూడా ఉంది. ఓ అపార్ట్‌మెంటులో 4 , 9 అంతస్తుల మధ్య ప్రాంతాన్ని క్షిపణి దారుణంగా దెబ్బతీసింది. 4 అంతస్తుల యూనివర్సిటీ భవనాన్ని కూడా రష్యా కూల్చేసింది.

పౌర నివాసాలపై దాడి చేయకూడదనే సంప్రదాయం ఉన్నా, దాన్ని ఉల్లంఘించిన రష్యా.. అపార్ట్‌మెంట్లపై విరుచుకుపడుతోందని ఉక్రెయిన్‌ అంతరంగిక మంత్రి ఆరోపించారు. ఉక్రెయిన్‌ సైనిక స్థావరాలపైనే తాము దాడులు చేస్తున్నట్లు రష్యా చెబుతోంది.

రష్యా ఆక్రమించిన తమ ప్రాంతాలపై ఉక్రెయిన్‌ అడపాదడపా దాడులను పెంచుతోంది. క్రమేపీ యుద్ధం రష్యా భూభాగంలోకి వెళ్తోందని, ఇది తప్పనిసరైన, సహజమైన, సముచితమైన ప్రక్రియ అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ‘‘ఉక్రెయిన్‌ సైన్యంలోని అశక్తత రోజురోజుకూ బయటపడుతోంది. నాటో కూటమి ఇచ్చిన ఆధునిక ఆయుధాలను కూడా వారు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇది నాటోలో, ఆయా దేశాల్లోని ప్రజల్లో తమ డబ్బు వృథా అవుతోందనే భావన కలుగచేస్తోంది’’ అని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ ఎద్దేవా చేశారు.



Updated : 1 Aug 2023 8:25 AM IST
Tags:    
Next Story
Share it
Top