Home > అంతర్జాతీయం > Donald Trump : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.. సుప్రీం సంచలన తీర్పు

Donald Trump : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.. సుప్రీం సంచలన తీర్పు

Donald Trump : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.. సుప్రీం సంచలన తీర్పు
X

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు భారీ షాక్‌ తగిలింది. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో కొలరాడో నుంచి పోటీ చేయకుండా ఆ రాష్ట్ర సుప్రీంకోర్టు ట్రంప్‌పై అనర్హత వేటు వేసింది. ఈ తీర్పు ప్రభావం వచ్చే ఏడాది మార్చి 5న జరిగే కొలరాడో రిపబ్లికన్స్‌ ప్రైమరీ బ్యాలట్‌పై మాత్రమే కాకుండా నవంబర్‌ 5న జరిగే సార్వత్రిక ఎన్నికలపై కూడా తీవ్రంగా ఉండనుంది. 2020లో అధ్యక్ష ఎన్నికల తరువాత ఆ దేశ పార్లమెంట్‌ భవనంపై భయానక దాడికి ట్రంప్‌ను కారకుడిగా గుర్తించింది.

2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారులు దాడి చేశారు. విధ్వంసాన్ని సృష్టించారు. దీనికి కారకుడు ట్రంప్ అని కొలరాడో సుప్రీంకోర్టు గుర్తించింది. 7గురు న్యాయమూర్తులు గల ధర్మాసనం ఈ మేరకు కొద్దిసేపటి కిందటే తీర్పు వెలువడించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను ప్రేరిపించిన కారణంగా అమెరికా రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం అమెరికా అధ్యక్ష పదవి చేపట్టేందుకు ట్రంప్‌ అనర్హుడని ప్రకటించింది. ఎన్నికల బ్యాలెట్ నుంచి డొనాల్డ్ ట్రంప్ పేరును తొలగించాలని ఆదేశించింది.

అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న ఓ వ్యక్తిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. అమెరికా రాజ్యంగంలోని 14వ సవరణ సెక్షన్‌ 3 ప్రకారం అధ్యక్ష అభ్యర్థిని అనర్హులుగా ప్రకటించడం ఇదే మొదటిసారి. కాగా ఈ తీర్పుపై అప్పీల్‌ చేసుకునే అవకాశాన్ని కోర్టు ట్రంప్‌నకు కల్పించింది.




Updated : 20 Dec 2023 8:57 AM IST
Tags:    
Next Story
Share it
Top