Home > అంతర్జాతీయం > ఇక సినిమాను తినొచ్చు.. కొత్త సర్వీస్.. వీడియో..

ఇక సినిమాను తినొచ్చు.. కొత్త సర్వీస్.. వీడియో..

ఇక సినిమాను తినొచ్చు.. కొత్త సర్వీస్.. వీడియో..
X

సినీ పరిశ్రమలో కొత్త ట్రెండ్ మొదలైంది. చూస్తున్న సినిమాను తినేసే సదుపాయం వచ్చేసింది! రీళ్లు, సీడీలు, పెన్ డ్రైవ్ వంటివాటిలోని సినిమాల గురించి కాదండోయ్. తెరమీద కదిలే సినిమాను రియల్ టైమ్‌లో రుచికరంగా ఆస్వాదించే విలాసం అన్నమాట. సినిమాలో కనిపించే ఆహారపదార్థాలను, పానీయాలను థియేటర్లలో సినిమా నడుస్తుండగానే ఆరగించొచ్చు. అలా తినడం వల్ల ప్రేక్షకులకు తాము కూడా సినిమాలో భాగమన్న అనుభూతి కలుగుతుందట. హీరోహీరోయిన్లు తింటున్న తిండిని తాము కూడా తిన్నామన్న అనుభూతితో మంచి సినీ అనుభవం సొంతమవుతుదంట. కొందరు ప్రేక్షకులు థియేటర్లో తెరపై మూవీ చూస్తూ తింటున్న ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీన్ని ఇప్పటికే 14 మిలియన్ల మంది చూశారు.

అమెరికాలోని లాస్ ఏంజెలిస్, న్యూయార్క్ నగరాల్లో కొన్ని థియేటర్లు ఇలా భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. చార్జీలు ఎప్పట్లాగే అదనం. క్రిస్మస్ సీజన్ కూడా రావడంతో ఈ ఫిల్మ్ ఫుడ్‌కు మంచి ఆదరణ లభిస్తోందట. సినిమాలో ఫుడ్ తినే సన్నివేశాలు లేకపోతే మాత్రం వడ్డించరు. ప్రేక్షకులు ఎప్పటికప్పుడు కొత్త అనుభూతుల కోరుకుంటున్నారని, వాళ్లను ఆకర్షించడానికి ఇలాంటి ఆకర్షణలు తప్పనిసరి అని ఈ సర్వీస్‌ను అందిస్తున్న Fork n’ Film కంపెనీ తెలిపింది.

https://www.instagram.com/reel/C0N3JaPuxV2/?utm_source=ig_web_copy_link

Updated : 5 Dec 2023 9:43 PM IST
Tags:    
Next Story
Share it
Top