Home > అంతర్జాతీయం > మైనార్టీల రక్షణ గురించి మోడీతో బైడెన్ చర్చించాలి - బరాక్ ఒబామా

మైనార్టీల రక్షణ గురించి మోడీతో బైడెన్ చర్చించాలి - బరాక్ ఒబామా

మైనార్టీల రక్షణ గురించి మోడీతో బైడెన్ చర్చించాలి - బరాక్ ఒబామా
X

భారత్ లో మైనార్టీల రక్షణకు సంబంధించి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రధాని నరేంద్రమోడీతో చర్చించాలని అన్నారు. సీఎన్ఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ అమెరికా పర్యటన సందర్భంగా తన స్నేహితుడని చెప్పుకునే బరాక్ ఒబామా ఇలాంటి కామెంట్లు చేయడం హాట్ టాపిక్గా మారింది.

"భారతదేశంలో మైనారిటీల హక్కులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మైనార్టీలకు రక్షణ కల్పించనిపక్షంలో ఏదో ఒక దశలో విడిపోవడానికి బలమైన అవకాశముందన్నది నా భావన. ఇలాంటి అంతర్గత విబేధాలు తలెత్తినప్పుడు ఏమవుతుందో గతంలో మనం చూశాం" అని ఒబామా అన్నారు.


అమెరికా పర్యటనలో భాగంగా జో బైడెన్, మోడీ సంయుక్త ప్రకటన సందర్భంగా భారత్ లో మైనార్టీల పరిస్థితిపై అడిగిన ప్రశ్నకు మోడీ సమాధానం ఇవ్వకపోవడంపై ఒబామా స్పందించారు. మరోవైపు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అమలు చేయని దేశాధినేతలతో మాట్లాడాల్సిన బాధ్యత అమెరికా అధ్యక్షుడికి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బరాక్ ఒబామా సీఎన్ఎన్ కు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి ప్రసారం కానుంది.


Updated : 22 Jun 2023 10:39 PM IST
Tags:    
Next Story
Share it
Top