Viral News : పాత గోడ ధర రూ. 41 లక్షలు.. ఏందయ్యా ఇది?
X
ఇళ్లను, స్థలాలను అమ్మడం కొనడం మామూలే. కానీ ఓ ప్రబుద్ధుడు ఓ అమ్మడానికి మరేమీ లేనట్లు ఓ గోడను అమ్మకానికి పెట్టాడు. అది కూడా ఏకంగా రూ. 41 లక్షలకు. ఆ ప్రాంతంలో విశాలమైన ఇంటి ధరే రూ. 10 కోట్లకు మించడం లేదు. మరి కేవలం ఓ పాత గోడను అంత ధరకు ఎందుకు అమ్మకానికి పెట్టాడానికి జనం బుర్రగోక్కుంటున్నారు. పూర్తి విషయం తెలిసి వార్నీ నీ గిల్లికజ్జాలు అని ఆశ్చర్యపోతున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ రాష్ట్రం ఓల్డ్ జార్జిటౌన్‌లో ఉందీ గోడ. గోడలో కొంత భాగం అలెన్ బర్గ్, మరికొంత భాగం డేనియలా వాల్స్ అనే మహిళ పేరు మీద ఉంది.
అలెన్ నిర్లక్ష్యం వల్ల గోడ నుంచి నీరు లీక్ అవుతూ తన ఇల్లు దెబ్బతింటోందని డేనియెలా వాపోతోంది. అయితే గోడ మరమ్మతుల కోసం చాలా ఖర్చు చేశానని అలెన్ చేతులెత్తేశాడు. ఇద్దరి మధ్య గొడవల ముదిరి టౌన్ ప్లానంగ్ అధికారులకు వరకు వెళ్లింది. గోడతో అంత ఇబ్బందిగా ఉంటే మీరే కొనుక్కోండి అంటూ అలెన్ దాన్ని రూ. 41 లక్షలకు(50 వేల డాలర్లు) ఖరీదుకు అమ్మకానికి పెట్టాడు. కూలిపోయే గోడకు అంత ఇవ్వనని 600 డాలర్లు (రూ. 50) మాత్రమే ఇస్తానని డేనియెలా తేల్చి చెప్పింది. పాతగోడకు అంత ఖరీదు ఎవరూ ఇవ్వరని అలెన్‌కు ఊరిపెద్దలు నచ్చజెబుతున్నా అతడు మాత్రం పట్టువీడలేదు. డేనియెలా కూడా కొనడానికి ససేమిరా అంటోంది. ఆలెన్ ఈ గోడను అమ్ముతానని పత్రికల్లో ఫోటోతో సహా ప్రకటన ఇవ్వడంతో ఈ సంగతి వెలుగులోకి వచ్చింది. ఫొటోను చూసిన జనం అంత మంచి ఇల్లు రూ. 41 లక్షలకే వస్తుందని ఉత్సాహపడిపోతూ, తర్వాత అసలు విషయం తెలిసి తలబాదుకుంటున్నారు.