టైటాన్ ఆశలు ఆవిరి.. సముద్రంలోనే ముక్కలైన సబ్మెరైన్
X
టైటాన్ సబ్మెర్సిబుల్.. ఆదివారం సముద్రంలోకి వెళ్లిన కొద్దిసేపటికే గల్లంతైంది. గంటలు గడుస్తున్న కొద్దీ దాన్ని జాడ కోసం క్షణక్షణం ఉత్కంఠ.. లోపలికి వెళ్లిన వారికి ఏం జరిగిందో అని వారి కుటుంబాల్లో ఆందోళన.. మొన్న లోపలి నుంచి శబ్దాలు వినిపించడంతో ఆశలు చిగురించాయి. ఈ క్రమంలో ఊపిరిబిగపట్టుకుని చూస్తున్న వారి కుటుంబాల ఆశలు ఆవిరయ్యాయి. టైటాన్ సమద్రంలోనే జల సమాధి అయ్యింది.
తీవ్రమైన పీడనం పెరగడం వల్ల టైటాన్ పేలిపోవడంతో అందులో ఉన్న ఐదుగురు మరణించారని అమెరికా కోస్ట్‌గార్డ్ ప్రకటించింది. రిమోట్ కంట్రోల్డ్ వెహికల్ సాయంతో మినీ జలాంతర్గామి శకలాలను గుర్తించామని తెలిపింది. టైటానిక్ ఓడ సమీపంలో 488 మీటర్ల దూరంలో ఈ శకలాలను గుర్తించినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రకటించింది. వెంటనే ఈ విషయాన్ని బాధితుల కుటుంబాలకు తెలిపినట్లు రియర్ అడ్మిరల్ జాన్ మౌగర్ తెలిపారు. యూఎస్ కోస్ట్ గార్డ్, రెస్య్కూ సిబ్బంది తరఫున మృతులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.
A debris field was discovered within the search area by an ROV near the Titanic. Experts within the unified command are evaluating the information. 1/2
— USCGNortheast (@USCGNortheast) June 22, 2023
టైటాన్ నిర్వాహక సంస్థ ఓషన్ గేట్ కూడా ప్రమాదంపై స్పందించింది. ‘‘టైటాన్లో ప్రయాణించిన ఐదుగురు వ్యక్తులు నిజమైన అన్వేషకులు. ప్రపంచ మహాసముద్రాల అన్వేషణ, రక్షణలో వీరు ఎంతో అభిరుచిని కలిగి ఉన్నారు. ప్రస్తుత ఈ విషాద సమయంలో వీరి కుటుంబాల గురించే మా ఆలోచనలు. ఈ ఘటనకు చింతిస్తున్నాం’’ అని ఓషన్ గేట్ ప్రకటిస్తుంది.
అట్లాంటిక్ మహాసముద్రంలో 12 వేల అడుగుల లోతులోని టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురు పర్యాటకులతో మినీ జలాంతర్గామి టైటాన్ గత ఆదివారం న్యూఫౌండ్‌ల్యాండ్ నుంచి బయలుదేరింది. బ్రిటిష్ బిలయనీర్ హమీష్ హార్డింగ్, పాకిస్థాన్ బిలియనీర్ షెహజాదా దావూద్ సహా ఆయన కుమారుడు సులేమాన్, ఫ్రెంచ్ మాజీ నావికా అధికారి పాల్ హెన్రీ, ఓషన్‌గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్ ఈ జలాంతర్గామిలో ప్రయాణించారు. అయితే వీరు వెళ్లిన్న కొన్ని గంటల తర్వాత ఆచూకీ గల్లంతయ్యింది. దీంతో కెనడా, అమెరికా తీర రక్షక దళాలు ముమ్మర గాలింపు చేపట్టాయి. చివరకు ఈ జలాతర్గామి కథ విషాదాంగా మిగిలింది.
Krishna
సట్టి కృష్ణ.. Mic Tv websiteలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో V6 News, CVR news,Mojo Tv, 6TV వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమా, అనాలిసిస్లు రాయగలరు.