మోదీ పర్యటన వేళ.. హెచ్-1బీ వీసాదారులకు శుభవార్త..!
Mic Tv Desk | 22 Jun 2023 4:42 PM IST
X
X
ప్రధాని మోదీ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి ఎన్ఆర్ఐలకు శుభవార్త వినిపించే అవకాశం కనిపిస్తుంది. హెచ్-1బీ వీసాదారులకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి మోదీ.. బైడెన్ తో చర్చిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇవాళ (జూన్ 22) అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల హెచ్-1బీ వీసా పొందడం మరింత ఈజీ అవనుంది.
ఈ నిర్ణయం వల్ల ఎన్ఆర్ఐలు స్వదేశానికి వెళ్లకుండానే తమ వీసాలను రిన్యువల్ చేసుకోవచ్చు. ఈ నిర్ణయం అమలయితే.. ప్రస్తుతం కొంతమందికి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. తర్వాత మిగతా వారు కూడా పొందొచ్చు. అమెరికా కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు హెచ్-1బీ వీసా ఇస్తాయి. ఈ వీసా తీసుకున్న వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉంటారు. 2022లో హెచ్-1బీ వీసా తీసుకున్న వారిలో 73 శాతం ఇండియన్స్ ఉన్నారు.
Updated : 22 Jun 2023 4:42 PM IST
Tags: america modi america tour pm modi Joe Biden h1b visa renewal H-1B visas latest news telugu news
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire