Home > అంతర్జాతీయం > భరాత్ మే.. అమెరికా రాయబారిణి హిందీ మాటలు వైరల్..

భరాత్ మే.. అమెరికా రాయబారిణి హిందీ మాటలు వైరల్..

భరాత్ మే.. అమెరికా రాయబారిణి హిందీ మాటలు వైరల్..
X

దేశాల మధ్య రాయబారులుగా పనిచేసేవారు కొన్ని భాషలు నేర్చుకోవడం తప్పనిసరి. అమెరికా రాయబారి చైనాలో పనిచేస్తుంటే చింగ్ చాంగ్ చింగ్ అని మాండరిన్ భాషల్లో మాట్లాడాల్సిందే. భారతీయ అధికారి ఏ ఆఫ్రికా దేశంలోనో పనిచేయాల్సి వస్తే అక్కడి భాష కాస్త వచ్చి ఉండాలి. ఎంత చక్కగా మాట్లాడితే కమ్యూనికేషన్ అంత బాగా ఉంటుంది. అమెరికాకు చెందిన రాయబారి మార్గరెట్ మెక్‌లియోడ్ మరో ఆకు ఎక్కువ చదివింది. భారత్‌తో రాయబార వ్యవహారాలు నడుపుతున్న ఆమె హిందీని అద్భుతంగా నేర్చుకుంది. ఢిల్లీలో జరుతున్న జీ20 సమావేశాల్లో భారతీ అధికారులతో హిందీలో మాట్లాడుతూ దడడదలాడించింది. విషయం కాస్తా మీడియాకు తెలియడంతో అందరూ ఆమె ముందు మైకులు పెట్టారు. హిందీలో వేసిన ప్రశ్నలకు ఆమె చక్కని హావభావాలు ప్రదర్శిస్తూ సమాధానాలు చెప్పింది.

మార్గరెట్ ఎక్కడ తడబడకుండా అమెరికా, భారత్ అమెరికా సంబంధాల గురించి అనర్గళంగా మాట్లాడింది. రెండు దేశాలు అన్ని రంగాల్లో కలసి మెలసి పనిచేస్తున్నాయని వివరించింది. జీ20 దేశాల్లో ఇండియా పేరుకు బదులు భారత్ పేరును వాడిని విషయాన్ని కూడా ఆమె బాగా గుర్తించుకుంది. ‘‘అమెరికా, భరాత్ మే.. బహత్ సహయోగ్ కరే.. ఇండియన్ సర్కార్ భీ.. ’’ అని ఎక్కడ తడబడకుండా మాట్లాడింది. భారత్ బదులు భరాత్ అని మాట్లాడినా దేఖా, బారే మే, అలగ్ అలగ్ అంటూ అంటూ హిందీ పదాలను అచ్చంగా పలికి దుమ్మురేపింది. 50 సెకెన్ల మార్గరెట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని అంటున్నారు.


Updated : 10 Sept 2023 4:31 PM IST
Tags:    
Next Story
Share it
Top