Jennifer Flewellen : అమ్మ చెప్పిన జోక్ విని.. కోమా నుంచి బయటకొచ్చిన కూతురు
X
ఈ సృష్టిలో అమ్మ ప్రేమకు ఏది సాటిరాదు. అమ్మ అంటే ఓ అనుభూతి... ఓ అనుబంధం... ఓ ఆప్యాయత...ఓ ఆత్మీయత. అమ్మ ప్రేమ ముందు అన్నీ దిగదుడుపే. తాజాగా ఓ తల్లి ప్రేమ కూతురుకు పునర్జన్మను ఇచ్చింది. బెడ్కే పరిమితమైన తన కూతురుకు సరికొత్త జీవితాన్ని ఇచ్చింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. మిచిగాన్లో చెందిన జెన్నిఫర్ ఫ్లెవెల్లెన్ 2017లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. దీంతో కోమాలోకి వెళ్లి అప్పటి నుంచి బెడ్కే పరిమితమైంది.
జెన్నీని తల్లి పెగ్గి మీన్స్ అన్నీ తానై చూసుకునేది. అయితే ఆగస్ట్ 25, 2022న ఓ అద్భుతం జరిగింది. ఆ రోజు తల్లి చెప్పిన జోక్కు జెన్నిఫర్ స్పందించింది. కోమా నుంచి నవ్వుతూ బయటకొచ్చింది. ప్రస్తుతం ఆమె మెల్లిమెల్లిగా కోలుకుంటోంది. జెన్నీ కోమా నుంచి బయటకొచ్చిన మాట్లాడడం లేదు, కదలడం లేదు. ‘‘ నేను చెప్పిన జోక్ విని జెన్నీ ఫస్ట్ టైం నవ్వగానే భయం వేసింది. గతంలో ఎప్పుడు అలా చేయలేదు. ఎట్టకేలకు ఆమె కోమా నుంచి బయటకు వచ్చి మా నమ్మకాన్ని నిజం చేసింది’’ అని పెగ్గి మీన్స్ చెప్పుకొచ్చింది. కాగా 1-2 శాతం రోగులు మాత్రమే కోమా నుంచి కోలుకోవడం జరుగుతుందని అక్కడి వైద్యులు తెలిపారు. ఇటీవల తన కొడుకు ఆడిన ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకు జెన్నీఫర్ వెళ్లింది.