ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం...పెళ్ళి మాత్రం అవడం లేదు
X
కోట్ల రూపాయలు ఉంటే ఏం లాభం కట్టుకున్నది పక్కన లేనప్పుడు అంటున్నాడు అమెరికా బిలియనీర్. మంచి శరీర సౌష్టవంతో అందంగా ఉండే బ్రియాన్ అనే వ్యక్తికి పెళ్ళి చేసుకోవడానికి అమ్మాయిలే దొరకడం లేదంట. అమ్మాయిల కోసం ఎదురు చూసి ఎదురు చూసి 45 ఏళ్ళు గడిపేశాడు.
బ్రియాన్ జాన్సన్....అమెరికాలో అత్యంత సంపన్నుల్లో ఒకడు. అందంగా ఉంటాడు. అందంగా ఉండడానికి చాలా కష్టపడతాడు. అస్సలు చెడు అలవాట్లు లేవు. కాని ఇన్ని మంచి లక్షణాలు ఉన్నా...ఇతన్ని పెళ్ళి చేసుకోవడానికి మాత్రం ఒక్కరూ ముందుకు రావడం లేదు. కనీసం డేటింగ్ కి కూడా ఎస్ చెప్పడం లేదంట. పాపం బ్రియాన్ కు ఇదో పెద్ద సమస్య అయిపోయింది. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టు తయారయింది ఇతని పరిస్థితి.
బ్రియాన్ వయసు 45. అయినా అది తెలియకుండా ఉండడానికి ట్రీట్ మెంట్ కూడా తీసుకుంటున్నాడు. ఏడాదికి ఏకంగా 16 కోట్లు ఖర్చు చేస్తున్నాడు. ఒకప్పుడు బాగా మందు తాగేవాడంట. కానీ క్యాలరీలు వస్తున్నాయని చెప్పి అది కూడా మానేశాడు బ్రియాన్. అందం కోసం రోజుకు 111 ట్యాబ్లెట్లు వేసుకుంటా అని చెబుతున్నాడు. అయినా అమ్మాయిలు దగ్గరకు కూడా రావడం లేదని వాపోతున్నాడు.
అయితే అమ్మాయిలు ఇతన్ని ఎందుకు ఇష్టపడడం లేదు, కనీసం డేటింగ్ కి కూడా ఎందుకు ఎస్ అని అనడం లేదు అని ఆరా తీస్తే తెలిసిన నిజం ఏంటంటే...బ్రియాన్ పెట్టే కండిషన్లే అని తెలిసింది. ఈ మధ్యనే ఓ పాడ్ కాస్ట్ లో బ్రియాన్ మాట్లాడాడు. అందులో అతని కండీషన్ల గురించి చెప్పాడు కూడా. బ్రియాన్ అందంగా ఉండడం కోసం చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడుట. ఉదయం 6 నుంచి 11లోపు మాత్రమే తింటాడుట. అది కూడా లెక్కగా 2250 క్యాలరీలు మాత్రమే. దాని తర్వాత ఏం ఇచ్చినా తినడు, తాగడు. అదీ కాక రాత్రి 8.30 గంటలకే నిద్రపోతాడుట. తన రోజులో 5 గంటలు ఏకాగ్రత, మంచి లైఫ్ స్టైల్ కోసం కేటాయిస్తాను అని చెబుతున్నాడు బ్రియాన్ జాన్సన్. న్యూట్రిషన్లు చెప్పిన ఫుడ్ కాకుండా ఇంకేమీ చచ్చినా తినడు అంట. నాకు ముడుచుకుని పడుకోవడం కూడా అలవాటు అని చెబుతున్నాడు. ఇదిగో సరిగ్గా ఈ అలవాట్లు, కండిషన్లే అమ్మాయిలను దూరంగా పారిపోయేలా చేస్తోంది. ఇంత స్ట్రిక్ట్ గా ఉంటే ఇతనితో వేగడం కష్టం...ఎంత డబ్బుంటే మాత్రం ఏం లాభం సుఖం లేనప్పుడు అంటూ మొహం చాటేస్తున్నారు.
పాపం జాన్సన్...ఎవరి కోసం అయితే ఇంతలా కష్టపడుతున్నాడో వారే అర్ధం చేసుకోవడం లేదు. ఇప్పుడు పెళ్ళి చేసుకోవడం మానేయాలా...లేకపోతే అందం కోసం తాపత్రయం పడడం మానేయాలో తెలియక తెగ తికమక పడిపోతున్నాడు. ఏది ఏమైనా తన ప్రయత్నాలు మాత్రం మానను అని గట్టిగా చెబుతున్నాడు.