Home > అంతర్జాతీయం > అమెరికా జ్వాలలు.. అంతకంతకు పెరుగుతున్న మృతుల సంఖ్య..

అమెరికా జ్వాలలు.. అంతకంతకు పెరుగుతున్న మృతుల సంఖ్య..

అమెరికా జ్వాలలు.. అంతకంతకు పెరుగుతున్న మృతుల సంఖ్య..
X

అమెరికాలో హవాయి దీవుల్లో చెలరేగిన కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. హవాయి దీవుల్లో రెండు పెద్ద ద్వీపమైన మౌయిలో భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించాయి. మృతుల సంఖ్య 36కు చేరగా వందల కోట్ల ఆస్తి బుగ్గిపాలైంది. పెనుగాలుల ధాటికి మంటలు మరింతగా వ్యాపిస్తున్నాయి. వందలాది ఇళ్లు, రిసార్టులు గుర్తుపట్టకుండా కాలిపోయాయి. లాహైనా పట్టణంలో వందలాది ఇళ్లు దట్టమైన పొగలో చిక్కుకున్నాయి. ఎన్ని హెలికాప్టర్లతో నీరు చల్లుతున్నా ప్రయోజనం లేకపోతోంది. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలామంది గల్లంతైనట్లు ఫిర్యాదు అందుతున్నాయి.

అధికారులు భారీ స్థాయిలో సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. అల్పపీడన ప్రభావంతో లేచిన ‘డోరా’ తుపాను సముద్ర తీరం దాటి భారీ వర్షాలు కురుస్తాయని, మంటలు చల్లారుతాయని భావిస్తున్నారు. మౌయి విమానాశ్రయంలో 2 వేల మంది ప్రయాణికులకు ఆశ్రయం కల్పించారు. దీవులను చూడటానికి వచ్చిన 4 వేల మంది తమను త్వరగా బయటికి తీసుకెళ్లాలని అధికారులు కోరుతున్నారు. మంగళవారం రాత్రి నుంచి మొదలైన మంటలు చుట్టుపక్క ప్రాంతాలకు విస్తరిస్తుండడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తున్నాయి. అన్ని చర్యలూ తీసుకోవాలని దేశాధ్యక్షుడు బైడెన్ బలగాలను ఆదేశించారు.

Updated : 10 Aug 2023 12:17 PM GMT
Tags:    
Next Story
Share it
Top