Home > అంతర్జాతీయం > పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ కు అవమానం

పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ కు అవమానం

పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ కు అవమానం
X

బ్రిట్నీ స్పియర్స్....ఫేమస్ పాప్ సింగర్. ఆమె పాటలకు, అందానికి ఫ్యాన్స్ పడి చచ్చిపోతారు. ఆమె ఆటోగ్రాఫ్ కోసం, ఫోటో కోసం వెంటపడతారు. అలాంటి పాప్ సింగర్ కు అవమానం జరిగింది. తన ఫేవరెట్ ఎన్బీఏ స్టార్ తో ఫోటో తీయించుకోవాలనుకుంటే ఆమెను తోసేసారు అతని సెక్యూరిటీ సిబ్బంది.





అమెరికాలోని వెగాస్ లో జరిగిందీ సంఘటన. వెగాస్ లోని అరియా అనే హోటల్ లో డిన్నర్ చేస్తోంది. అక్కడకు ఎన్బీఏ స్టార్ ప్లేయర్ విక్టర్ వెంబన్యామ కూడా వచ్చాడు. ఇతనంటే బ్రిట్నీకి కూడా వీరాభిమానం. ఆ అభిమానంతోనే అతనితో ఫోటో తీయించుకోవాలని వెళ్ళింది. అయితే అప్పటికే అక్కడ అతని అభిమానులు చుట్టుముట్టేయడంతో అతణ్ని వెనక నుంచి తట్టింది. దాన్ని గమనించిన వెంబన్యామ సెక్యూరిటీ ఛీఫ్ డామియెన్ స్మిత్ బ్రిట్నీని బలంగా వెనక్కు తోసేసాడు. దాంతో బ్రిట్నీ కిందపడిపోయింది. ఆమె కళ్ళద్దాలు కూడా కిందపడిపోయాయి. వెంటనే అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయింది బ్రిట్నీ.





ఇది జరిగిన కొద్దిసేపటికి సెక్యూరిటీ ఛీఫ్ స్మిత్...బ్రిట్నీ దగ్గరకు వెళ్ళి క్షమాపణలు చెప్పాడు. అప్పటికి అతణ్ణి క్షమించినట్టు అనిపించినా తర్వాత హోటల్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఈ సంఘటన మీద ఫోలీసులకు ఫిర్యాదు చేసింది బ్రిట్నీ. దీని మీద పోలీసులు విచారణ జరుపుతున్నారు.

అయితే వెంబన్యామ వెర్షన్ వేరేలా ఉంది. అసలు బ్రిట్నీ స్పియర్ వచ్చినట్టే తనకు తెలియదని చెబుతున్నాడు. తనను వెనుక నుంచి బలంగా ఎవరో పట్టుకున్నారని...అందుకే తన సెక్యూరిటీ వాళ్ళు తోసేసారని చెప్పాడు. అది జరిగిన తర్వాత తనకు వచ్చింది బ్రిట్నీ అని తెలిసిందని చెప్పుకొచ్చాడు. ఆమె చెబుతున్నట్టు మెల్లగా తట్టలేదని అన్నాడు. అయితే బ్రిట్నీ దీని మీద మళ్ళీ పోస్ట్ పెట్టంది. తాను వెంబన్యామను బలంగా కొట్టలేదు, వెనక నుంచి పట్టుకోలేదని కూడా చెప్పింది. సున్నితంగా మాత్రమే పిలిచానని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

బ్రిట్నీకి జరిగిన అవమానాన్ని ఆమె ఫ్యాన్స్ మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఎంతటి ఫేమస్ ఆటగాడు అయినా...అంతటి ఫేమస్ పాప్ సింగర్ ను అలా అవమానించడం బాలేదని అంటున్నారు.



Updated : 7 July 2023 3:08 PM IST
Tags:    
Next Story
Share it
Top