Home > అంతర్జాతీయం > భారత్ పై మరోసారి ప్రశంసలు కురిపించిన పుతిన్

భారత్ పై మరోసారి ప్రశంసలు కురిపించిన పుతిన్

భారత్ పై మరోసారి ప్రశంసలు కురిపించిన పుతిన్
X

భారత్ ను మరోసారి ప్రశంసలతో ముత్తెతాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. భారత్‌ అనుసరిస్తోన్న విదేశీ విధానం అద్భుతమని కొనియాడారు. అలా పాటించడం నేటి ప్రపంచంలో అంత సులభం కాదని చెప్పారు. భారత రాజకీయాలను ప్రభావితం చేసేందుకు బయటనుంచి ఆటలు ఆడే ప్రయత్నాలకు భవిష్యత్తు ఉండదని స్పష్టం చేశారు. ‘రష్యన్‌ స్టూడెంట్‌ డే’ సందర్భంగా కాలినింగ్రాడ్‌ ప్రాంతంలోని యూనివర్సిటీ విద్యార్థులతో ముచ్చటించిన పుతిన్ ప్రధాని మోదీని మరోసారి ప్రశంసించారు.

మోదీ నేతృత్వంలో స్వతంత్ర విదేశీ విధానాన్ని భారత్‌ అనుసరిస్తోందన్న పుతిన్..నేటి ప్రపంచంలో అది అంత తేలిక కాదన్నారు. సుమారు 150 కోట్ల జనాభా కలిగిన భారత్‌కు ఆ హక్కు ఉందని తెలిపారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో భారత్‌ ఒకటిగా నిలవడానికి కారణం ప్రధాని నరేంద్రమోదీనే అన్నారు. ఆయన సారథ్యంలోనే భారత్‌ ఇంత వేగంగా అభివృద్ధి సాధిస్తుందోని అన్నారు. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా మోదీ నిర్ణయాలు తీసుకుంటారని ఊహించడం అసాధ్యమని చెప్పారు. ఈక్రమంలో భారత్‌, ఆ దేశ నాయకత్వంపై రష్యా ఆధారపడవచ్చని వ్యాఖ్యానించారు. భారత్‌కు గొప్ప సంస్కృతి ఉందని పొగిడారు. వైవిధ్యంతో పాటు ఎంతో ఆసక్తిగా ఉంటుందని తెలిపారు. నేషనల్ టీవీ ఛానెళ్లలో భారతీయ సినిమాలను ప్రసారం చేసే అతికొద్ది దేశాల్లో రష్యా ఒకటని ఇలా మరే దేశం చేస్తుందని అనుకోవడం లేదని చెప్పారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో స్టార్ట్ అయిన ‘మేకిన్‌ ఇండియా’ కార్యక్రమాన్ని రష్యాతో పాటు ఎన్నో దేశాలు వింటున్నాయని తెలిపారు. ఈ ప్రణాళికలన్నింటినీ ఆచరణలో పెట్టేందుకు భారత భాగస్వాములతో కలిసి ప్రయత్నిస్తున్నామని వివరించారు. భారత్‌కు వచ్చే విదేశీ పెట్టుబడుల్లో అత్యధికంగా రష్యా నుంచే వస్తున్నాయని పుతిన్ స్పష్టం చేశారు.




Updated : 26 Jan 2024 4:58 PM IST
Tags:    
Next Story
Share it
Top