Home > అంతర్జాతీయం > రష్యాకు మారుతున్న యుద్ధం

రష్యాకు మారుతున్న యుద్ధం

రష్యాకు మారుతున్న యుద్ధం
X

రష్యా- ఉక్రెయిన్ లమధ్య వార్ ముగిసిపోతుంది అనుకున్నారు. కొన్నాళ్ళే యుద్ధం ఉంటుందని అందరూ భావించారు. కానీ ఎన్నాళ్ళయినా రష్యా యుద్ధవిరమణ చర్యలు చేపట్టడంలేదు. అటు ఉక్రెయిన్ కూడా లొంగడం లేదు. ఈ వార్ మొదలై దాదాపు 522 అవుతోంది. ఇప్పుడు తాజా పరిణామం ఏంటంటే ఈ యుద్ధం నెమ్మదిగా ఉక్రెయిన్ నుంచి రష్యాకు బదిలీ అవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ నే చెప్పారు.

ఉక్రెయిన్ రోజురోజుకూ బలపడుతోందని అంటున్నారు ఉక్రెయిన్ అధ్యక్షడు జెలన్ స్కీ. అది క్రమంగా రష్యా భూభాగంలోని ప్రధాన ప్రాంతాలకు పాకుతోందని వ్యాఖ్యానించారు. అయితే ఆ దాడులకు ఉక్రెయిన్‌దే బాధ్యత అని ఎక్కడా అంగీకరించలేదు. రష్యాలో గందరగోళం సృష్టించడానికి ఉక్రెయిన్‌ గత కొన్ని నెలలుగా ఇదే విధానం అనుసరిస్తోంది. ఆదివారం ఉక్రెయిన్ నుంచి వచ్చిన రెండు డ్రోన్లు మాస్కోలోని బిజినెస్ డిస్ట్రిక్ట్ లోని రెండు బిల్డింగ్ ల మీద విరుచుకుపడ్డాయి. అక్కడి వినుకోవా విమానాశ్రయాన్ని కాసేపు మూసేశారు కూడా. నెలరోజుల తేడాలో డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి చేయడం ఇది నాలుగోసారి.

గ్రోన్ల దాడులతో రష్యాలోని ప్రజలు భయభ్రాంతులకు గురవుతోంది. అయితే ఉక్రెయిన్ మాత్రం ఎక్కడా తగ్గేదేలా అని చెబుతోంది. మొదటి నుంచీ రష్యాకు ధీటుగా స్పందిస్తున్న ఉక్రెయిన్ ఇలాగే వ్యూహాత్మకంగా రష్యా మీద విరుచుకుపడనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచదేశాలు కూడా ఉక్రెయిన్ కు సపోర్ట్ చేస్తుండడం ఈ దేశానికి కలిసివస్తున్న అంశం.

Updated : 31 July 2023 6:56 AM GMT
Tags:    
Next Story
Share it
Top