Home > అంతర్జాతీయం > హమాస్ చెరలో బందీగా 21 ఏళ్ల మ‌హిళ‌.. వీడియో రిలీజ్

హమాస్ చెరలో బందీగా 21 ఏళ్ల మ‌హిళ‌.. వీడియో రిలీజ్

హమాస్ చెరలో బందీగా 21 ఏళ్ల మ‌హిళ‌.. వీడియో రిలీజ్
X

గత వారం ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ బందీగా ఉన్న ఓ బాధితురాలి వీడియో ఫుటేజీని హమాస్(Hamas) యోధులు సోమవారం విడుదల చేశారు. తమ చెరలో ఉన్న బందీల ప‌ట్ల మాన‌వ‌త్వంతో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు చెప్పేందుకు హ‌మాస్ తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేసింది హమాస్. అందులో ఓ మహిళ చేతికి తీవ్ర గాయంతో బాధపడుతూ కన్పించింది. ప్రస్తుతానికి తాను బాగానే ఉన్నానని చెప్పిన ఆ యువతి.. వీలైంనంత త్వరగా తనను ఇక్కడి నుంచి విడిపించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని వేడుకుంది.

21 ఏళ్ల మియా స్కీమ్ అనే మ‌హిళ చేతికి చికిత్స చేస్తున్న‌ట్లు ఆ వీడియోలో ఉంది. కొన్ని రోజుల క్రితం హ‌మాస్ అక్ర‌మ రీతిలో ఇజ్రాయిల్‌లోకి చొర‌బ‌డి కొంద‌ర్ని కిడ్నాప్ చేసిన విష‌యం తెలిసిందే. ఆ బందీల్లో 21 ఏళ్ల మియా ఒక‌రు. ఓ గుర్తు తెలియ‌ని మెడిక‌ల్ వ‌ర్క‌ర్ ఆమెకు చికిత్స చేస్తున్న వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. ఆ వీడియోపై ఐడీఎఫ్ కూడా ప్ర‌క‌ట‌న రిలీజ్ చేసింది.

ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకు హమాస్‌ మిలిటరీ విభాగమైన ఇజ్‌ అద్‌-దిన్‌ అల్‌-కస్సామ్‌ బ్రిగేడ్స్‌ ఈ వీడియోను టెలిగ్రామ్‌లో విడుదల చేసినట్లు తెలుస్తోంది. వీడియాలో ఆ మహిళ ‘‘నా పేరు మియా. మాది గాజా సరిహద్దులోని షోహమ్‌ అనే ప్రాంతం. ప్రస్తుతం నేను గాజా (Gaza)లో ఉన్నాను. ఆ రోజు (అక్టోబరు 7) నేను రీమ్‌ కిబుట్జ్‌లో జరిగిన సూపర్‌నోవా మ్యూజిక్‌ పార్టీకి వెళ్లా. నా చేతికి తీవ్ర గాయమైంది. గాజాలో నాకు మూడు గంటల పాటు సర్జరీ జరిగింది. వాళ్లు నన్ను బాగానే చూసుకుంటున్నారు. మందులు ఇస్తున్నారు. నేను అడుగుతున్నది ఒక్కటే.. వీలైనంత త్వరగా నన్ను ఇక్కడి నుంచి విడిపించండి. మా అమ్మనాన్నల దగ్గరకు తీసుకెళ్లండి’’ అని తెలిపింది. ఆమె ఎలా గాయపడిందో మాత్రం మియా ఆ వీడియోలో వివరించకపోవడం గమనార్హం.

Updated : 17 Oct 2023 1:58 PM IST
Tags:    
Next Story
Share it
Top