Home > అంతర్జాతీయం > షార్ట్ వీడియో మెసేజ్ ఆప్షన్ వచ్చేసింది

షార్ట్ వీడియో మెసేజ్ ఆప్షన్ వచ్చేసింది

షార్ట్ వీడియో మెసేజ్ ఆప్షన్ వచ్చేసింది
X

వాట్సాప్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడూ ఏదొ ఒక కొత్త ఫీచర్ ను తీసుకొస్తూనే ఉంటుంది మెటా. అందుకే దీన్ని యూజర్లు వదిలిపెట్టలేకపోతున్నారు. తాజాగా మరో కొత్త ఫీచర్ ను యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్.

షార్ట్ వీడియో మెసేజ్...





ఒక్కోసారి మన చెప్పాల్సింది చాలా ఉంటుంది. కానీ టైప్ చేయలేము, సమయమూ తక్కువే ఉంటుంది. అలాంటప్పుడు వాయిస్ మెసేజ్ పెడుతుంటాం. ఇక మఅదట దాన్ని మరింత ఎఫెక్టివ్ గా వీడియో రూపంలో కూడా చెప్పొచ్చు. ఇదే షార్ట్ వీడియో ఫీచర్. మామూలుగా వాట్సాప్ లో వీడియో పంపించాలంటే...ముందు మన ఫోన్ లో వీడియో తీసుకుని పంపించాలి. కానీ ఇప్పుడు అలా అక్కరలేదు. డైరెక్టుగా వాట్సాప్ నుంచే వీడియో తీసి పంపించవచ్చు. దీన్నే రియల్ టైమ్ వీడియో అంటారు.






షార్ట్ వీడియో 60సెకెన్ల వరకు పంపించుకోవచ్చును. టెక్ట్స్ బాక్స్ పక్కనున్న వాయిస్ రికార్డ్ ఆప్షన్ సాయంతో ఈ ఫీచర్ ను వాడుకోవచ్చును. రికార్డ్ సింబల్ ను కొన్ని సెకెన్ల పాటూ హోల్డ్ చేస్తే వీడియో ఆప్షన్ కు మారుతుంది. వీడియో ప్లే చేస్తే డీఫాల్ట్ గా సౌండ్ లేకుండా ప్లే అవుతుంది. ఈ ఫీచర్ ఐఫోన్, అండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్. అయితే ప్రస్తుతానికి కొంతమందికి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. మిగిలిన వారికి త్వరలో వస్తుంది. ఈ ఫీచర్ ను వినియోగించుకోవాలంటే వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.


Updated : 28 July 2023 3:25 PM IST
Tags:    
Next Story
Share it
Top