Home > అంతర్జాతీయం > ఒక్క బాల్ వేయకుండానే వికెట్...ఎవరు ఆ బౌలర్..?

ఒక్క బాల్ వేయకుండానే వికెట్...ఎవరు ఆ బౌలర్..?

ఒక్క బాల్ వేయకుండానే వికెట్...ఎవరు ఆ బౌలర్..?
X

అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డులకు కొదవ లేదు. ఎవరొకరు రికార్డులు సృష్టించడ.. వాటిని మరొకరు బీట్ చేయడం తరచుగా జరుగుతూనే ఉన్నాయి. కొన్ని రికార్డులు మాత్రం పదిలంగా ఉంటాయి. వాటిని బీట్ చేయడం కొంచెం అసాధ్యమే అని చెప్పాలి. వాటిలో ఇప్పుడు చెప్పబోతున్న రికార్డు ఒకటి.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ బౌలర్ ఒక్క బాల్ వేయకుండానే వికెట్ సాధించాడు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్న ఇది రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నమోదైంది. బంతి వేయకుండానే వికెట్ సాధించాడు ఓ భారతీయ ఆటగాడు. ఈ రికార్డు సొంతం చేసుకున్నది ఓ పేరు గాంచిన బౌలర్ అనుకుంటే పొరపాటే. టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

2011లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో విరాట్ 0వ బంతికి వికెట్ తీశాడు. ధోని ఆదేశాల మేరకు బాల్ అందుకున్న కోహ్లీ.. మొదటి బంతిని కెవిన్ పీటర్సన్‌కి బౌలింగ్ చేశాడు. కానీ అది వైడ్ బాల్ అయ్యింది. ఆ సమయంలో పీటర్సన్ క్రీజ్‌లో లేకపోవడంతో కీపర్ ధోని వికెట్లను గిరాటేశాడు. దీంతో కెవిన్ పీటర్సన్‌ స్టంపౌట్‌గా వెనుదిరగడంతో విరాట్ ఖాతాలో వికెట్ చేరింది. వైడ్ బాల్ అనేది కౌంట్ కాదు. కానీ స్టంపౌట్ చేస్తే అవుట్‌గా పరిగణిస్తారన్న సంగతి తెలిసిందే. ఇలా ఒక్క బాల్ వేయకుండానే వికెట్ సాధించిన ఏకైక బౌలర్ గా విరాట్ చరిత్రలో నిలిచాడు. ఈ రికార్డును మరొక బౌలర్ సాధించడం దాదాపు కష్టమే.

Updated : 24 Jun 2023 6:22 PM IST
Tags:    
Next Story
Share it
Top