మూడు తలల చిరుత..ఎంత కష్టపడ్డాడంటే..
X
అత్యంత వేగంగా పరిగెత్తే వైల్డ్ ఆనిమల్ చిరుత. ఒక్కోసారి గాలితో పోటీ పడి మరీ పరిగెత్తుతుందా అని అనిపిస్తుంది దాని పరుగు చూసి. అత్యంత వేగవంతమైన చీతాకు ఏ జంతువైనా అడ్డుపడితే ఇక అంతే సంగతులు. ప్రాణాలు గాల్లో వదిలేయాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా చీతాల జాతి మెల్లమెల్లగా అంతరించిపోయే దశకు చేరుకున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. అలాంటిది ఆఫ్రికాలోని కొన్ని అడవుల్లో మాత్రం చీతాలు విరివిగా కనిపిస్తుంటాయి. అలాంటి అడవిలో ఓ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ అద్భుతమైన చీతాను తన కెమెరాలో బంధించాడు. తన ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేశారు. ఈ ఫొటోను చూసిన వారంతా ఆ ఫొటోగ్రాఫర్‌ను పొగడ్తలతో ముంచేశారు. అతని క్రియేటివిటికి ఫిదా అవుతున్నారు.
విబుల్డన్‌కు చెందిన వరల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ పాల్ గోల్డ్‌స్టీన్ మూడు తలలు ఉన్న చిరుత ఫోటోను తన కెమెరాలో బంధించాడు. ఈ ఫోటో తీయడానికి ఫోటోగ్రాఫర్ ఏకంగా 7 గంటల పాటు వర్షంలో తడిసి ముద్దయ్యాడట. అంతటి కష్టానికి ఈ అద్భుతమైన ఫోటో సాక్ష్యంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సోషల్ మీడియాలో ఈ పిక్ షేర్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
ఈ పొటోను ఒకసారి పరీక్షగా చూస్తే ఒకే చిరుతకు మూడు తలలు ఉన్నట్లు ఉంటుంది. కానీ నిజానికి అవి మూడు చిరుతలు. వేర్వేరు దిశల్లో కూర్చున్నాయి. అది కాస్త ఫోటోగ్రాఫర్ కంట పడింది. అక్కడే ఫోటోగ్రాఫర్ తన పనితనం చూపించాలనుకున్నాడు. ఈ దృష్యాన్ని ఎలాగైనా బంధించాలనుకున్నాడు. పర్ఫెక్ట్ టైమింగ్‌లో ఈ పిక్ తీసి అందరిని ఆకర్షిస్తున్నాడు పాల్ గోల్డ్‌స్టీన్. ఈ ఫొటోను చూసినవారంతా వారేవాహ్.. ఏం టైమింగ్ గురూ అని ఆ పాల్ గోల్డ్స్టీన్ను పొగడ్తలతో ముంచేస్తున్నారు.