Home > అంతర్జాతీయం > Nikki Haley : నన్ను పెళ్లి చేసుకుంటావా..? నిక్కీ హేలీని అడిగిన ట్రంప్‌ సపొర్టర్..

Nikki Haley : నన్ను పెళ్లి చేసుకుంటావా..? నిక్కీ హేలీని అడిగిన ట్రంప్‌ సపొర్టర్..

Nikki Haley  : నన్ను పెళ్లి చేసుకుంటావా..? నిక్కీ హేలీని అడిగిన ట్రంప్‌ సపొర్టర్..
X

అమెరికాలో ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా రిపబ్లికన్ పార్టీ తరుపున మాజీ అధ్యక్షుడు ట్రంప్, నిక్కి హేలీ పోటీపడుతున్నారు. న్యూహంప్షైర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమెకు ట్రంప్ సపోర్టర్ నుంచి అనూహ్య పరిణామం ఎదురైంది. సభలో ఆమె ప్రస్తుండగా.. ఓ వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగారు. దీంతో సభలో నవ్వులు పూశాయి. ఈ క్రమంలో నిక్కీ.. మీరు నాకు ఓటేస్తారా అని అడిగారు. కాసేపు ఆలోచించిన అతడు.. ట్రంప్కే తన ఓటు అని స్పష్టం చేశారు. వెంటనే నిక్కీ అయితే ఇక్కడి నుంచి వెళ్లిపో అనడంతో సభ మొత్తం సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత ఆమె తన ప్రసంగాన్ని కొనసాగించారు

రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ కు నిక్కీ హేలీ గట్టి పోటీనిస్తున్నారు. ఇక న్యూహంప్షైర్ లోని డిక్స్‌విల్లే నాచ్ ప్రైమరీలో నిక్కీ గెలిపొందారు. మొత్తం 6 ఓట్లు ఉండగా.. అన్నీంటిని ఆమె కైవసం చేసుకున్నారు. దీనిపై స్పదించిన ఆమె.. ఇది గొప్ప ఆరంభం..థ్యాంక్స్ డిక్స్‌విల్లే నాచ్ అంటూ ట్వీట్ చేశారు. నిక్కీ సౌత్‌ కరోలినా గవర్నర్గా గతంలో రెండు సార్లు పనిచేశారు. ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా వ్యవహరించారు.


Updated : 24 Jan 2024 1:29 AM GMT
Tags:    
Next Story
Share it
Top