Home > అంతర్జాతీయం > మరో రెండేళ్ళల్లో విద్యుత్ విమానాలు వచ్చేస్తున్నాయి

మరో రెండేళ్ళల్లో విద్యుత్ విమానాలు వచ్చేస్తున్నాయి

మరో రెండేళ్ళల్లో విద్యుత్ విమానాలు వచ్చేస్తున్నాయి
X

విద్యుత్ తో పనిచేసే విమానం మరో రెండేళ్ళల్లో ప్రారంభం కానున్నాయి. మొదటి విమానం ఇంగ్లండ్ లోని సౌతాంప్టన్ నుంచి ఎడిన్ బర్గ్ వరకు ఈ విమానాలు తిరగనున్నాయి. ఎకోజెట్ అనే సంస్థ వీటిని తయారు చేస్తోంది. ఇంధన కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించేందుకే విద్యుత్ విమానాలను తీసుకువస్తున్నామని ఎకోజెట్ చెబుతోంది.

బ్రిటీష్కు చెందిన బడా బిజినెస్ మ్యాన్ డేల్ విన్స్ ఎకోజెట్ కంపెనీని నెలకొల్పారు. విద్యుత్ విమానాల తయారీకి ముందు డేల్ విన్స్ జస్ట్ స్టాప్ ఆయిల్ లాంటి పర్యవరణహిత కార్యక్రమాలను కూడా చేశారు. ఎకోజెట్ విద్యుత్ విమానాలు రెండు రకాలుగా ఉంటాయని కంపెనీ చెబుతోంది. ఒకటి 19 సీట్ల సామర్ధ్యంతో ఉంటే.. మరొకటి 70 సీటల్తో ఉంటుందని తెలిపింది.

ఎకోజెట్ విమానాలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ద్వారా నడుస్తాయి. వీటివల్ల 90వేల టన్నుల వరకు కర్బన ఉద్గారాలు తగ్గిస్తుంది. దీనివలన పర్యావరణానికి చాలా హితం జరగుతుందని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం పాత విమానాలకే మరమ్మత్తులు చేసి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ను అమర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి బాగా సక్సెస్ అయితే కొత్త ఫ్లైట్ల తయారీకి చర్యలు చేపడతామని డేల్ విన్స్ చెబుతున్నారు.


Updated : 1 Aug 2023 6:37 PM IST
Tags:    
Next Story
Share it
Top