వామ్మో కారులో బెడ్రూమా?..ఇదెక్కడా చూడలేదే..
X
కార్లంటే ఎవరికి పిచ్చి ఉండదు చెప్పండి. చిన్నప్పుడు టాయ్ కార్లతో క్రేజ్ మొదలై, పెద్దయ్యాక లగ్జరీ కార్లవైపు మనసు మల్లుతుంది. పెద్ద పెద్ద కార్లను కొనుగోలు చేయాలని వాటిని ఒక్కసారైనా జీవితంలో నడపాలను చాలా మంది ఆశపడుతుంటారు. కొంత మంది మాత్రమే ఆ ఆశలను నెరవేర్చుకుంటారు. అందుకోసం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తుంటారు. ఆ జాబితాకు చెందినవాడే ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న ఈ షేక్. రాచకుటుంబానికి చెందిన షేక్ హమద్ బిన్ హమ్దాన్ అల్ నాహ్యాన్ ప్రపంచంలోనే అతి పెద్ద కారును తన సొంతం చేసుకున్నారు. అందుకోసం వంద కోట్లకు పైగానే డబ్బును ఖర్చు చేశారు. దీంతో అందరి దృష్టి ఇప్పుడు షేక్‌పై పడింది. ఏంటి కారు కోసం వంద కోట్లా అన్న డౌట్ రావచ్చు. అది కామనే, కానీ కారు చూస్తే మాత్రం అందరి మైండ్స్ బక్లా అవ్వాల్సిందే.. చిన్న సైజు అపార్ట్‌మెంట్‌నే తలపిస్తుంది ఈ కారు. మరి కారు స్పెషాలిటీ ఏమిటో మనమూ తెలుసుకుందామా?
వలర్డ్లోనే బిగ్గెస్ట్ లగ్జరీ కారు ఇది. దీని చూస్తూ ఓ చిన్న సైజు కొండలా కనిపిస్తుంది. ఎత్తు సుమారు 21.6 అడుగులు ఉంటుంది. ఈ కారులో రెండు ఫ్లోర్లు ఉంటాయి. అమెరికన్ ఫేమస్ కార్ల కంపెనీ హమ్మర్ ఈ కారును ఎంతో స్పెషల్‌గా డిజైన్ చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాచకుటుంబానికి చెందిన షేక్ హమద్ బిన్ హమ్దాన్ అల్ నాహ్యాన్ 20 మిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.164.52 కోట్లు చెల్లించి మరీ ఈ అతి పెద్ద కారును సొంతం చేసుకున్నారు. ఈ షేక్‌కు కార్లంటే మహా పిచ్చి. ఇప్పటికే తన దగ్గర ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ఖరీదైన కార్లు ఉన్నాయి. ఈ జాబితాలోకి ఈ భారీ కారు కూడా చేరిపోయింది.
ఇక హమ్మర్ కంపెనీ రూపొందించిన ఈ కారు మాస్టర్ ట్రక్‌గా పేరుపొందింది. ‘హమ్మర్ హెచ్1 ఎక్స్3’ మోడల్ కారు ఇది. ఇప్పుడు ఈ కారు ఈ అరబ్ షేక్ సొంతం అయ్యింది. సాధారణంగా ఒక కారుకు ఒక ఇంజిన్ మాత్రమే ఉంటుంది. కానీ ఈ మాస్టర్ ట్రక్ రోడ్డుపై పరుగులు పెట్టేందుకు నాలుగు డీజిల్ ఇంజన్లను అమర్చారు తయారీదారులు. గంటకు 32 కి.మీ.ల వేగంతో రోడ్లపై ఇది ప్రయాణిస్తుంది. ఒక్కో అంతస్తులో ఒక బెడ్‌రూమ్, ఒక కిచెన్, ఒక బాత్‌రూమ్ వచ్చేలా అత్యద్భుతంగా దీనిని డిజైన్ చేశారు. ఇదే ఈ కారు స్పెషాలిటీ. చూడటానికి కారులా ఉన్నా లోపల మాత్రం ఓ ఇంటి పీల్‌ను కలిగిస్తుంది. ఇక కారులోని రెండో అంతస్తులో డ్రైవర్ సీటు ఏర్పాటు చేశారు. కారు మొత్తం వుడెన్ ఫ్లోరింగ్ ఉంటుంది. కారులో అడుగు పెడుతూనే ఒక ఇంట్లోకి అడుగుపెట్టినట్లే ఉంటుంది. నిజానికి దీనిని కారు అని అనడం కంటే ఓ ఇళ్లు అని నడమే కరెక్టేమో.