Home > అంతర్జాతీయం > భారత్ జైల్లో ఉన్న ఉగ్రవాది భార్యకు పాక్‌లో మంత్రి పదవి

భారత్ జైల్లో ఉన్న ఉగ్రవాది భార్యకు పాక్‌లో మంత్రి పదవి

భారత్ జైల్లో ఉన్న ఉగ్రవాది భార్యకు పాక్‌లో మంత్రి పదవి
X

కశ్మీర్‌పై ఆశలు వదిలేసుకున్న పాకిస్తాన్ ఆ వివాదాన్ని ఏదో ఒకరకంగా సజీవంగా ఉంచేందుకు నానా తిప్పలూ పడుతోంది. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రపన్నిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కశ్మీర్ ఉగ్రవాది యాసిన్ మాలిక్ భార్యకు మంత్రి పదవి అప్పగించింది. పాక్ త్కాలిక ప్రధాని అన్వర్‌ ఉల్‌ హక్‌ కకర్‌.. మాలిక్ భార్య ముషాల్ హుస్సేన్‌ మల్లిక్‌ను తన కేబినెట్లో చేర్చుకున్నాడు. జమ్మూ కశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (జేకేఎల్‌ఎఫ్‌)ను నడిపిన యాసిన్‌ మాలిక్‌ ఉగ్రవాద కేసులో దోషిగా తేలడంతో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ముషాల్‌కు కేబినెట్ పదవి అప్పగించడం ద్వారా పాకిస్తాన్ తన ఉద్దేశం ఏమిటో చెప్పకనే చెప్పిందని పరిశీలకుల అంచనా.జేకేఎల్‌ఎఫ్‌పై భారత ప్రభుత్వం ఉక్కుపాదం మోపి ఆ సంస్థను ఆనవాళ్లు లేకుండా నిర్మూలించింది.

యాసీన్ మాలిక్ 2009లో పాక్‌కు చెందిన ముషాల్ హుస్సేన్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లికి పాక్ రాజకీయ నేతలు, సెలబ్రిటీలు హాజరయ్యారు. పాక్ పార్లమెంటును గడువుకు ముందు మూడు రోజుల ముందే రద్దు చేయడం తెలిసిందే. తాత్కాలిక ప్రధానిగా బలూచ్ నేత కకర్ నియమితులయ్యారు. ఆయన పాక్ సైన్యం ఆదేశించినట్లు నడుచుకుంటున్నారని చెబుతున్నారు. కకర్‌తోపాటు ముషాల్ సహా 16 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ముషాల్ మంత్రి హోదాలో మహిళలు, మానవ హక్కులు తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వనుంది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ముషాల్ అర్ధనగ్న చిత్రాలు వేయడంలో దిట్ట. కశ్మీరీ ప్రజల కష్టాలు కన్నీళ్లంటూ ఆమె కొన్ని బొమ్మలు వేసి ప్రచారం చేసింది. పీస్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ పేరుతో ఎన్జీవో నడుపుతోంది.

Updated : 18 Aug 2023 10:13 AM IST
Tags:    
Next Story
Share it
Top