Home > అంతర్జాతీయం > యూట్యూబర్ గిఫ్ట్ ల కోసం ఎగబడ్డ జనం

యూట్యూబర్ గిఫ్ట్ ల కోసం ఎగబడ్డ జనం

యూట్యూబర్ గిఫ్ట్ ల కోసం ఎగబడ్డ జనం
X

ఇప్పుడు హవా అంతా ఆన్ లైన్ ఇన్ఫ్లుయెర్స్ దే. సినీ తారల్లానే వాళ్ళకూ లక్షల్లో అభిమానులు ఉంటున్నారు. ఇలాంటి యూట్యూబరే ఒక అతను న్యూయార్క్ లో అతని అభిమానులను కలుస్తాను, ఫ్రీ గిఫ్ట్ లు ఇస్తాను అంటూ ప్రకటించాడు. కానీ అది కాస్తా రభస రభస అయి న్యూయార్క్ నగర వీధులు రణరంగంగా మారాయి.

కైసీనట్ అనే 21 ఏళ్ళ యూట్యూబర్ న్యూయార్క్ లోని మాన్ హటన్ దగ్గర స్క్వేర్ పార్క్ లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తానంటూ పోస్ట్ పెట్టాడు. దీనిలో తన ఫ్యాన్స్ కలుస్తానని చెప్పాడు. అక్కడితో ఆగిపోతే బాగుండును కానీ తనని కలిసిన వారికి ప్లే స్టేషన్ 5 గేమ్ కన్సోల్స్ తో పాటూ ఇంకెన్నో గిఫ్ట్ లు కూడా ఇస్తానని ప్రకటించాడు. దీంతో స్క్వేర్ పార్క్ దగ్గరకు అభిమానులు పోటెత్తారు.

సీనట్ ను చూడ్డానికి 2వేలకు పైగా ఫ్యాన్స్ తరలివచ్చారు. దీంతో అక్కడి వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. వీరిని అదుపు చేయడం పోలీసుల వల్ల కూడా కాలేదు. బారికేడ్లను ఏర్పాటు చేసినా లాభం లేకపోయింది.దాంతో పాటూ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మరికొంత మంది ఏకంగా అల్లర్లకు పాల్పడ్డారు. వాహనాలను అడ్డకోవడమే కాదు వాటిని ధ్వంసం చేయడానికి ప్రయత్నం కూడా చేశారు. బిల్డింగ్ ల మీదకెక్కి నినాదాలు చేశారు. ఈ ఘర్షణలో పోలీసులుతో సమా కొంతమంది గాయపడ్డారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకెళ్ళారు. సీనట్ ను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.

ఈ గొడవలకు కారణమయిన సీనట్ మీద పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు. అతడి మీద క్రిమినల్ కేసును నమోదు చేశారు. సీనట్ పాపులర్ వీడియో క్రియేటర్. అతనికి 65 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. లాస్ట్ ఇయర్ స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచాడు కూడా.





Updated : 5 Aug 2023 6:41 AM GMT
Tags:    
Next Story
Share it
Top