Zelensky : 31 వేల మంది మృతి.. జెలెన్‌స్కీ షాకింగ్ కామెంట్స్
X
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. రష్యా దాడి వల్ల తమ దేశ సైనికులు 31 వేల మంది చనిపోయారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెెలెన్‌స్కీ అన్నారు. రెండేళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఎంతో మంది గాయపడ్డారన్నారు. యుద్దం మొదలై రెండేళ్లు అవుతున్నా ఉక్రెయిన్ మాత్రం తమ దేశ సైనికులు ఎంత మంది మరణించారో చెప్పలేదు. చాలా మంది ఈ విషయంలో మృతుల సంఖ్య భారీగానే ఉంటుందని అంచనా వేశారు.
రష్యా ఇచ్చే తప్పుడు సమాచారం వల్ల తమ దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు జెలెన్‌స్కీ అన్నారు. అందుకే తాను మృతుల సంఖ్యను కచ్చితంగా చెబుతున్నానన్నారు. యుద్ధంలో ఇప్పటి వరకూ 31000 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించినట్లు స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ చెబుతున్నది నిజం కాదన్నారు. తమకు తీవ్రమైన నష్టం జరిగిందని, అయితే వాటిపై కూడా రష్యా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను భయపెడుతోందన్నారు.
ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యా ఆక్రమించుకుని వేలాది మందిని పొట్టనబెట్టుకుంది. హత్యకు గురైనవారు, వేధింపులకు గురైనవారు వేలాది మంది ఉన్నారు. గత ఏడాది ఆగస్టులో 70 వేల మంది ఉక్రెయిన్ సైనికులు మృతిచెందినట్లు అమెరికా తెలిపింది. అలాగే రష్యాకు చెందిన 1,80,000 మంది సైనికులు మరణించారని అమెరికా స్పష్టం చేసింది. ఇకపోతే రష్యా సైన్యంలో 45 వేల మంది మాత్రమే మరణించారని బ్రిటన్ రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రష్యా సైనికులు పుతిన్‌కు భయపడి చాలా మంది వలసలు వెళ్లిపోయారన్నారు.