Home > అంతర్జాతీయం > ప్రిగోజిన్ను చంపింది రష్యా అధ్యక్షుడే: జెలెన్స్కీ

ప్రిగోజిన్ను చంపింది రష్యా అధ్యక్షుడే: జెలెన్స్కీ

ప్రిగోజిన్ను చంపింది రష్యా అధ్యక్షుడే: జెలెన్స్కీ
X

రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ దళ అధిపతి ప్రిగోజిన్ మరణం వెనుక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హస్తం ఉందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రిగోజిన్ కొన్ని నెలల క్రితం రష్యా సైన్యంపై తిరుగుబాటు చేసి సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత బెలారస్ వెళ్లి తలదాచుకున్నాడు. ఈ క్రమంలో పుతిన్, ప్రిగోజిన్ మధ్య వైరం సద్దుమణిగిందని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో చెప్పుకొచ్చారు. ఇలా ప్రకటించిన కొద్ది రోజులకే ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో చనిపోయాడు. అతనికి రక్షణగా ఉన్నబాడీగార్డులు, పైలట్లు సహా ఈ ప్రమాదంలో 10మంది మరణించారు.

ఈ క్రమంలో జెలన్ స్కీ పుతిన్ ను ఆరోపించారు. కీవ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో పుతిన్ పై విమర్శలు గుప్పించారు. ప్రిగోజిన్ ను చంపింది పుతిన్ అన్న మాట వాస్తవం అన్నారు. కానీ దానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలను బయటపెట్టలేదు. విమాన ప్రమాదానికి గల కారణాన్ని పరిశోధిస్తున్నామని ఇప్పటికే తెలిపారు. అంతేకాకుండా ప్రిగోజిన్ విమాన ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిందా అని దర్యాప్తు జరుగుతుంది.

Updated : 9 Sep 2023 3:06 AM GMT
Tags:    
Next Story
Share it
Top