Home > IPL 2023 > ఈ ప్లేఆఫ్స్ వెరీ స్పెషల్.. ఒక్కో డాల్ బాల్కు 500 మొక్కలు.. మొత్తం ఎన్ని డాట్ బాల్స్ పడ్డాయో తెలుసా?

ఈ ప్లేఆఫ్స్ వెరీ స్పెషల్.. ఒక్కో డాల్ బాల్కు 500 మొక్కలు.. మొత్తం ఎన్ని డాట్ బాల్స్ పడ్డాయో తెలుసా?

ఈ ప్లేఆఫ్స్ వెరీ స్పెషల్.. ఒక్కో డాల్ బాల్కు 500 మొక్కలు.. మొత్తం ఎన్ని డాట్ బాల్స్ పడ్డాయో తెలుసా?
X

ఐపీఎల్ ప్లేఆఫ్స్ మొదలైనప్పటినుంచి.. గేమ్ లో డాట్ బాల్ పడ్డ ప్రతిసారీ.. స్కోర్ బోర్డ్ దగ్గర ఒక చెట్టు బొమ్మ రావడం ఎంతమంది గమనించారు. ఇలా ఎందుకు వస్తుందో తెలియక చాలామంది అయోమయంలో పడిపోయారు. దీనికి కారణం లేకపోలేదు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా బీసీసీఐ ఒక ప్రోగ్రాం నిర్వహించింది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ నుంచి ఫైనల్ వరకు ఎన్ని డాట్ బాల్స్ పడతాయో లెక్కించి.. ఒక్కో డాట్ బాల్ కు 500 మొక్కలు నాటాలని నిర్ణయించుకుంది. పట్టణీకరణ పేరుతో చెట్లను కొట్టేసి అపార్ట్ మెంట్స్ కడుతున్నారు. అలా జరిగే పర్యావరణానికి హాని జరుగుతుందని భావించిన బీసీసీఐ.. చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ప్లేఆఫ్స్, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ లో ఎన్ని డాట్ బాల్స్ పడ్డాయి? బీసీసీఐ ఎన్ని మొక్కలు నాటబోతుందంటే...

క్వాలిఫయర్ 1లో 84, ఎలిమినేటర్ లో 96, క్వాలిఫయర్ 2లో 67, ఫైనల్ మ్యాచ్ లో 45 డాట్ బాల్స్ వేశారు ఆటగాళ్లు. ప్లేఆఫ్స్ లో మొత్తం 292 డాట్ బాల్స్ నమోదయ్యాయి. అంటే.. ఈ లెక్కన 292×500 మొత్తం 1,46,000 మొక్కలు నాటనుంది బీసీసీఐ. ఇందులో ఎక్కువ భాగం ముంబై ప్లేయర్ ఆకాశ్ మధ్వాల్, గుజరాత్ ప్లేయర్స్ మహమ్మద్ షమీ, రషీద్ ఖాన్, చెన్నై ప్లేయర్ పతిరనలవే ఉన్నాయి. బీసీసీఐ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది. ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు.


Updated : 31 May 2023 7:09 PM IST
Tags:    
Next Story
Share it
Top