ipl2023 : ఐపీఎల్ సీజన్లో స్విగ్గీ రికార్డు.. నిమిషానికి ఎన్ని బిర్యానీ ఆర్డర్లో తెలుసా
X
క్రికెట్ అభిమానులను దాదాపు రెండు నెలల పాటు ఐపీఎల్ అలరించింది. గుజరాత్తో జరిగిన ఫైనల్లో చివరి బంతికి గుజరాత్ టైటాన్స్ను ఓడించి, చెన్నై సూపర్ కింగ్స్ కప్పు ఎగరేసుకుపోయింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ నేపథ్యంలో ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ రికార్డు సృష్టించింది. చెన్నైతో పాటు బిర్యానీ కూడా కప్పు ఎగరేసుకుపోయింది. ఈ సీజన్లో మోస్ట్ ఆర్డర్డ్ డిష్గా బిర్యానీ నిలిచిందని స్విగ్గీ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
ఈ ఐపీఎల్ సీజన్లో మొత్తం 12మిలియన్లకు పైగా ఆర్డర్స్ వచ్చాయని పేర్కొన్న స్విగ్గీ.. అందులో ఎక్కువ ఆర్డర్స్ వచ్చింది బిర్యానీకేనని ప్రకటించింది. ఈ సీజన్లో స్విగ్గీకి నిమిషానికి 212 బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్టు తెలిపింది. అంతేకాదు ఈ సీజన్లో అత్యంత వేగవంతమైన ఆర్డర్ డెలివరీ కేవలం 77 సెకన్లలో అందించినట్లు స్విగ్గీ చెప్పుకొచ్చింది. ఆ ఆర్డర్ కోల్కత్తాలో డెలివరీ చేశారు.
12 మిలియన్పై పైగా ఆర్డర్స్తో బెంగళూరు టాప్లో నిలిచింది. అలాగే ఢిల్లీకి చెందిన ఓ కస్టమర్.. ఏకంగా 701 సమోసాలు ఆర్డర్ పెట్టాడు. ఒకే వ్యక్తి సింగిల్ ఆర్డర్లో రూ. 26, 474 గిరాకీ చేశాడట. కస్టమర్స్ ఎక్కువగా ఆర్డర్ చేసిన వంటకాలు చికెన్ బిర్యానీ, బటర్ నాన్, మసాలా దోసాలు. వీటివల్ల స్విగ్గీలో ఆర్డర్ లు 30శాతం పెరిగాయి.