త్వరలో ఆపరేషన్.. హాస్పిటల్లో చేరనున్న ఎంఎస్ ధోని
X
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ను మట్టికరిపించిన చెన్నై.. కప్పు ఎగరేసుకుపోయింది. ఐదోసారి ఛాంపియన్గా అవతరించింది. అనంతరం సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ సర్టరీ కోసం.. ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్లో చేరాడు. ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభం అయిన దగ్గర నుంచి మోకాలి నొప్పితో బాధపడుతున్న ధోనీ.. చికిత్స కోసం హాస్పిటల్లో చేరినట్లు క్రికెట్ వర్గాలు చెప్తున్నాయి. ముందుగా టెస్టులు చేయించుకుని, తర్వాత సర్జరీ చేయించుకుంటారని తెలుస్తోంది.
ఐపీఎల్లో కొన్ని సందర్భాల్లో ధోని నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. అంతటి మోకాలి నొప్పితోనూ ధోని మ్యాచ్లు ఆడాడు. చెపాక్లో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ అనంతరం.. స్టేడియం అంతా తిరుగుతూ అభిమానులకు అభివాదం తెలిపాడు ధోని. ఈ క్రమంలో ధోని మోకాలికి నీ క్యాప్ పెట్టుకుని తిరగడం కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఓ వైపు నొప్పిని భరిస్తూనే ఒక్క మ్యాచ్ మిస్ కాకుండా.. జట్టును ముందుండి నడిపించాడు. ఫైనల్కు చేర్చి జట్టను గెలిపించాడు. ఇక వచ్చే ఏడాది ఐపీఎల్లో కూడా ధోని కనిపంచే అవకాశం ఉంది. ఐపీఎల్ సీజన్కు మరో 9 నెలల టైం ఉందని.. ఈ గ్యాప్లో శరీరం సహకరిస్తుందో లేదో టెస్ట్ చేసుకుని రిటైర్మెంట్ గురించి ప్రకటిస్తానని ఫైనల్ మ్యాచ్ అనంతరం ధోని చెప్పాడు.
MS Dhoni admitted to Kokilaben Hospital in Mumbai for knee surgery