ఐపీఎల్ సీజన్‌లో ఇతడే అత్యంత చెత్త బౌలర్...
X
ఐపీఎల్ -2023 సోమవారంతో ముగిసింది. విన్నర్‌గా చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్‌గా గుజరాత్ టైటాన్స్ నిలిచాయి. బ్యాటింగ్, సత్తా చాటిన శుభమన్ గిల్ అరెంజ్ క్యాప్, అత్యధిక వికెట్లు సాధించినందుకు గాను షమీకి పర్ఫూల్ క్యాప్ అవార్డులు దక్కాయి. టోర్నీలో వివిధ విభాగాల్లో రాణించిన పలువురు ప్లేయర్స్‌కి కూడా అవార్డులు పొందారు.ఇక ఐపీఎల్ 2023లో బెస్ట్ పోతే..వరెస్ట్ ఎవరన్నదానిపై చర్చ జరుగుతోంది. అందులో ముందుగా విన్నింగ్ టీమ్ చెన్నై బౌలర్ తుషార్ దేశ్‌పాండే పేరు వినిపిస్తోంది.
ఈ యువ బౌలర్ ఐపీఎల్‌లో అత్యంత చెత్త బౌలర్ గా రికార్డులకెక్కాడు. 16 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీసి శభాష్ అనిపించుకున్నా...పరుగులు మాత్రం ధారాలంగా సమర్పించుకున్నాడు. ప్రధానంగా ఫైనల్ మ్యాచ్‌లో దేశ్‌పాండేను గుజరాత్ బ్యాటర్లు చితక్కొట్టారు. ఫైనల్ మ్యాచ్‌లో దేశ్‌పాండే వేసి 4 ఓవర్లు వేసి 56 పరుగులు వచ్చాయి. దీంతో వికెట్ దక్కించుకోకుండా ఐపీఎల్ ఫైనల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ల జాబితాలో తుషార్ దేశ్ పాండే రెండో స్థానంలో నిలిచాడు.అతడి కంటే ముందు షేన్ వాట్సన్ (61 పరుగులు) ఉన్నాడు.
ఐపీఎల్‌లోనే అత్యధిక పరుగులు
గుజరాత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లోనే కాకుండా ఐపీఎల్ 16వ సీజనల్ అంతటా దేశ్‌పాండే బౌలింగ్‌లో ప్రత్యర్థులు భారీగా పరుగులు పిండుకున్నారు. ఈ సీజన్ లో అతను 9.92 ఎకానమీతో 564 పరుగులు ఇచ్చాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో దేశ్ పాండే ఇచ్చిన 564 పరుగులే అత్యధికం. 2022 సీజన్‌లో 8.28 సగటు ఎకానమీతో 551 పరుగులను లీక్ చేసిన ప్రసిద్ధ్ కృష్ణను దేశ్‌పాండే అధిగమించాడు.