Home > IPL 2023 > ipl2023 : ఐపీఎల్ ట్రోఫీపై సంస్కృత పదాలు.. అర్థం ఏంటో తెలుసా?

ipl2023 : ఐపీఎల్ ట్రోఫీపై సంస్కృత పదాలు.. అర్థం ఏంటో తెలుసా?

ipl2023 : ఐపీఎల్ ట్రోఫీపై సంస్కృత పదాలు.. అర్థం ఏంటో తెలుసా?
X

ఏ సీజన్ జరగనంత ఉత్నంఠంగా ఐపీఎల్ 2023 జరిగింది. ఫైనల్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే టెన్షన్ ఒక ఎత్తైంతే.. చివరి బాల్ వరకు సాగిన మ్యాచ్ మరో ఎత్తు. బాల్ బాల్కు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్లో చివరికి చెన్నై కప్పు ఎగరేసుకుపోయింది. ఈ క్రమంలో.. ఫైనల్ మ్యాచ్ జరిగినప్పటి నుంచి ఐపీఎల్ ఫ్యాన్స్ గూగుల్పై పడ్డారు. ఐపీఎల్ ట్రోఫీపై రాసి ఉన్న సంస్కృత పదాల అర్థం గురించి వెతుకుతున్నారు. సోషల్ మీడియాలో డిబేట్లు పెట్టి చర్చిస్తున్నారు. ఇంతకీ ఆ పదాల అర్థం ఏంటి? వాటిని ట్రోఫీపై ఎందుకు రాశారంటే...

ట్రోఫీపై ‘యత్ర ప్రతిభా అవసర ప్రాప్నోతిహి’ అని ఉంటుంది. అంటే ‘ఎక్కడ ప్రతిభ ఉంటుందో.. అక్కడ వారికి తప్పక అవకాశం లభిస్తుంది’ అని అర్థం. ఇంగ్లిష్ లో ‘వేర్ టాలెంట్ మీట్స్ ఆపర్చునిటీ’ అని. అంతేకాకుండా.. ఐపీఎల్ మెయిన్ థీమ్ కూడా ఇదే. దేశవాళి ఆటగాళ్లను అంతర్జాతీయ స్టార్లో కలిపి.. వాళ్ల అనుభవాలు, ఆలోచన కుర్రాళ్లకు పంచుతూ, వాళ్లను భావి క్రికెటర్లుగా తీర్చి దిద్దడమే దీని ఉద్దేశం.

ఇప్పుడు అదే నిజం అవుతోంది. దేశవాళిలో ఆడే అవకాశం రాక.. ఎంతో మంది ట్యాలెంట్ ఉన్న ఆటగాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది ఐపీఎల్. క్రీడా రాజకీయాలను దాటి ఎదగలేని వారికి మార్గం అయింది. ఓవర్ నైట్ స్టార్లను చేసింది. అందుకే ఐపీఎల్ ప్రపంచంలోనే బెస్ట్ లీగ్ అంటుంటారు.

Updated : 31 May 2023 4:45 PM IST
Tags:    
Next Story
Share it
Top