భారీ జీతంతో.. NCERTలో 170 ఉద్యోగాలు
X
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) ఉద్యోగ భర్తీ ప్రకటనను విడుదల చేసింది. వివిధ కేటగిరీల్లో మొత్తం 170 పోస్టులకుగానే నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా.. ప్రూఫ్ రీడర్, అసిస్టెంట్ ఎడిటర్, డీటీపీ ఆపరేటర్ పోస్టుల భర్తీ జరగనుంది. వీటి వాకిన్ లు ఢిల్లీలో నిర్వహిస్తున్నారు. కాగా ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు.. ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయో సడలింపు ఉంటుంది.
* ఏదైనా డిగ్రీ, పీజీ పూర్తిచేసిన వారు అర్హులు. ఆయా శాఖల్లో ఎక్స్ పీరియన్స్ ఉన్నవారినే పరిగణంలోకి తీసుకుంటారు.
* అసిస్టెంట్ ఎడిటర్ ఉద్యోగాలు మొత్తం 60 ఉండగా.. ఇంగ్లిష్ 25, హిందీ 25, ఉర్దూ 10 ఖాళీలు ఉన్నాయి. 50 ఏళ్ల వయో పరిమితి. నెలకు రూ.80వేల జీతం ఇస్తారు.
* ప్రూఫ్ రీడర్ పోస్టుల్లో మొత్తం 60 పోస్టులు ఖాళీ ఉండగా.. ఇంగ్లిష్ 25, హిందీ 25, ఉర్దూ 10 ఖాళీలు ఉన్నాయి. దీనికి 42 ఏళ్ల వయోపరిమితి. నెల జీతం రూ.37 వేలు ఇస్తారు. ఏదైనా ప్రింటింగ్, పబ్లిషింగ్ సంస్థలో ఏడాది పాటు పనిచేసిన అనుభవం ఉండాలి.
* 50 డీటీపీ ఆపరేటర్స్ పోస్టులు ఉండగా.. ఇంగ్లిష్ 20, హిందీ 20, ఉర్దూ 10 ఖాళీలు ఉన్నాయి. వయోపరిమితి 45 ఏళ్లు ఉండగా.. నెలకు రూ.50వేల జీతం ఇస్తున్నారు.