భారీ రిక్రూట్మెంట్..1.78 లక్షల పోస్టులు..ఎవరైనా అప్లై చేసుకోవచ్చు
X
ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి స్థానిక రిజర్వేషన్లకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. టీచర్ పోస్టుల భర్తీలోనూ అదే విధానాన్ని అనుసరిస్తారు. కానీ ఈ విషయంలో మాత్రం బీహార్ ముఖ్యమంత్రి నిరుద్యోగులకు ఓ శుభవార్తను అందించారు. స్థానికేతరులు ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని తాజాగా బంపర్ ఆఫర్ను ప్రకటించారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో ఏ రాష్ట్రం వారైనా అప్లై చేసుకునేలా అనుమతి ఇవ్వాలంటూ విద్యాశాఖ ప్రతిపాదనకు బీహార్ క్యాబినెట్ మంగళవారం జరిగిన సమావేశంలో ఆమోదం తెలిపారు. గతంలో బీహార్లో గవర్నమెంట్ స్కూల్స్లో స్థానికులనే టీచర్లుగా నియమించేవారు.
1.78 లక్షల పోస్టులు :
బీహార్ సర్కార్ నిర్ణయంతో గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్ పోస్టుల నియామకం కోసం రెసిడెన్షియల్ రిజర్వేషన్ ఏమీ ఉండదు.ప్రస్తుతం బీహార్ సర్కార్ ప్రైమరీ, సెకెండరీ, హై స్కూల్స్ కలుపుకుని 1.78 లక్షల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. 85,477 ప్రైమరీ టీచర్లు, 1,745 మాధ్యామిక టీచర్లు, 90,804 హైస్కూల్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. బీహార్ రాష్ట్రంలో సవరించిన పాఠశాల ఉపాధ్యాయ నిబంధనలు 2023 ప్రకారం.. టీచర్లుగా నియమితులైన వారందరూ రాష్ట్రం సర్కార్ ఉద్యోగులకు సమానమైన హోదాను కలిగి ఉంటారని పేర్కొంది.