Home > ఉద్యోగాలు > Bank Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంకు మేనేజర్ ఉద్యోగాలు..

Bank Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంకు మేనేజర్ ఉద్యోగాలు..

Thumb: నెలకు రూ.70 వేల జీతం!!!

Bank Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంకు మేనేజర్ ఉద్యోగాలు..
X





బ్యాంక్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Central Bank of India)లో భారీగా మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌ స్కేల్‌-2 మేనేజర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ రెగ్యులర్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న ఈ బ్యాంకు శాఖల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు జులై 15లోపు https://ibpsonline.ibps.in/cbimmjun23/ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..

పోస్టు వివరాలు:

మేనేజర్ (మెయిన్ స్ట్రీమ్)- మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-2: 1000 పోస్టులు

అర్హత: ఏదైనా డిగ్రీ. CAIIB ఉత్తీర్ణులై ఉండాలి. PSB/ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌/RRBలో ఆఫీసర్‌గా మూడేళ్ల పని అనుభవం. లేదా PSB/ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌/ RRBలో క్లర్క్‌గా ఆరేళ్ల పని అనుభవంతోపాటు సంబంధిత విభాగంలో MBA/ MCA/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 31.05.2023 నాటికి 32 ఏళ్లు మించకూడదు.

పే స్కేల్: నెలకు రూ.48,170-రూ.69,810.

పోస్టింగ్ స్థలం: దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:రూ.850; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.175.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.07.2023.

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: ఆగస్టు రెండు/ మూడో వారం, 2023.



Updated : 3 July 2023 6:58 AM IST
Tags:    
Next Story
Share it
Top