ఇఫ్లూలో ఉద్యోగాల భర్తీ..ఎంపికైతే నెలకు 2లక్షల జీతం..
X
ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్, షిల్లాంగ్‌లోని ఇఫ్లూ క్యాంపస్‌లలో ఖాళీగా ఉన్న 97 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.అర్హులైన అభ్యర్థులు జూన్ 26 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ. 18 వేల నుంచి రూ. 2,09,200 చొప్పున జీతం ఇస్తారు. మరిన్ని వివరాల కోసం ఇఫ్లూ వెబ్‌సైట్ : https://www.efluniversity.ac.in/ కు లాగిన్ అవొచ్చు.
ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు..
గ్రూప్-ఎ పోస్టులు:
డిప్యూటీ రిజిస్ట్రార్ : 1
అసిస్టెంట్ రిజిస్ట్రార్ : 4
హిందీ ఆఫీసర్ : 1
డిప్యూటీ లైబ్రేరియన్ : 2
అసిస్టెంట్ లైబ్రేరియన్ : 5
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ : 1
గ్రూప్- బి పోస్టులు:
సెక్షన్ ఆఫీసర్ : 1
అసిస్టెంట్ : 7
పర్సనల్ అసిస్టెంట్ : 6
ప్రొఫెషనల్ అసిస్టెంట్ : 1
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) : 1
జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) : 1
సెక్యూరిటీ ఆఫీసర్ : 1
ప్రైవేట్ సెక్రటరీ (ప్రొ-వీసీ) : 1
హిందీ ట్రాన్స్‌లేటర్: 1
స్టాటిస్టికల్ అసిస్టెంట్ : 1
గ్రూప్-సి పోస్టులు:
అప్పర్ డివిజన్ క్లర్క్: 7
సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ : 2
లోయర్ డివిజన్ క్లర్క్: 56
హిందీ టైపిస్ట్: 1
డ్రైవర్ (షిల్లాంగ్ క్యాంపస్) : 1
కుక్ : 1
ఎంటీఎస్ పోస్టులు: 29