ఆధార్ అప్డేట్కు గడువు పెంపు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..!
X
ఆధార్ కార్డ్ ఉచిత అప్ డేట్ కు చివరి తేదీ అయిపోయిందని బాధపడుతున్నవాళ్లకు కేంద్ర గుడ్ న్యూస్ చెప్పింది. అప్డేట్ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మూడు నెలలు గడువు పెంచుతున్నట్లు ప్రకటిచింది. సెప్టెంబర్ 14 వరకూ గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదట మార్చి 15 నుంచి జూన్ 14 వరకు ఉచిత అప్ డేట్ అవకాశం కల్పించగా.. అది ముగిసింది. డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా ఆధార్ వివరాలు అప్‌డేట్ (Aadhaar Update) చేసేందుకు అవకాశం కల్పించింది. అయితే, ఆధార్ కార్డ్ హోల్డర్స్ తమ వివరాలు అప్డేట్ చేయడానికి ఆఫ్‌లైన్‌లో, ఆన్‌లైన్‌లో అవకాశం ఉంటుందన్న సంగతి తెలిసిందే.
ఆధార్‌లోని వివరాలను అప్‌డేట్ చేయడానికి గుర్తింపు రుజువు, చిరునామా రుజువును తిరిగి ధృవీకరించమని UIDAI కోరుతోంది. ఆధార్ కార్డ్ ఉన్న ఏ వ్యక్తి అయినా తన పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాల్లో మార్పులు చేయవచ్చు. MyAadhaar పోర్టల్‌లో ఆన్‌లైన్ పద్ధతిలో వివరాలు అప్డేట్ చేయడానికి ఒక్క రూపాయి కూడా ఫీజ్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఆఫ్‌లైన్ పద్ధతిలో, అంటే ఆధార్ కేంద్రాలకు స్వయంగా వెళ్లి వివరాలు అప్‌డేట్ చేయాలనుకుంటే మాత్రం గతంలోలాగే 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో మీ ఆధార్ వివరాలు అప్డేట్ చేయడానికి https://myaadhaar.uidai.gov.in/ ఓపెన్ చేయాలి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. Online Update Services పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత Update Aadhaar Online పైన క్లిక్ చేయాలి. Proceed to Update Aadhaar పైన క్లిక్ చేయాలి. పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఆప్షన్స్‌లో మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. మీ వివరాలు అప్‌డేట్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. పేమెంట్ అవసరం లేకుండా ప్రాసెస్ పూర్తి చేయాలి. ఈ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత మీకు అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్ ఎస్ఎంఎస్ రూపంలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వస్తుంది. యూఆర్ఎన్ నెంబర్‌తో మీ ఆధార్ అప్‍డేట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.