కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌కు ఈసీ సూచన..ఆచితూచి మాట్లాడండి
Congress leader Rahul EC's advice to Speak up
X
లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎలక్షన్ కమిషన్ కీలక సూచన చేసింది. బహిరంగ సభల్లో ఆచితూచి మాట్లాడాలంది. గతంలో ప్రధాని మోదీని ఉద్దేశించి పనౌతి, పిక్ పాకెట్ అంటూ రాహుల్ వ్యాఖ్యానించడంపై ఢిల్లీ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీని ఆదేశించింది. అందులో భాగంగానే తాజాగా ఆయనకు నోటీసులు ఇచ్చిన ఈసీ.. ఇకపై సభలు, సమావేశాల్లో జాగ్రత్తగా మాట్లాడాలని సూచించింది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు.. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల కమిషన్ ఈ సూచన చేసింది. గతేడాది నవంబర్‌లో రాహుల్ గాంధీ ప్రధానిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రచారంలో రాజకీయ నేతల ప్రసంగాలు హద్దుమీరుతున్న నేపథ్యంలో సంయమనం పాటించాలంటూ కోరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ ‘పనౌటీ’ అనే పదాన్ని రాహుల్ గాంధీ ఉపయోగించారు. గతేడాది ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే.జట్టు ఓటమిపై రాహుల్ స్పందించారు. మంగళవారం ప్రపంచకప్‌లో ఓడిపోవడానికి మోదీనే అంటూ పరోక్షంగా కారణమని వ్యాఖ్యానించారు. ‘మన అబ్బాయిలు దాదాపు ప్రపంచకప్ గెలుచుకున్నారు. ఓ చెడు శకునం (పనౌటి) ప్రవేశం వారిని ఓడిపోయేలా చేసింది’ అంటూ మోదీని ఉద్దేశిస్తూ పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, అమిత్‌షా, అదానీలను జేబుదొంగలతో పోల్చారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.