Home > జాతీయం > Special Trains : ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతి ప్రత్యేక రైళ్ల పొడిగింపు

Special Trains : ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతి ప్రత్యేక రైళ్ల పొడిగింపు

Special Trains : ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతి ప్రత్యేక రైళ్ల పొడిగింపు
X

దక్షిణ మధ్య రైల్యే ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల కోసం పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను(Special trains ) పొడిగించింది. తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగల్లో ఒకటైన సంకాంత్రి(Sankranti) పండుగ జనవరి రెండోవారంలో ఉన్నందున పలు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.పండుగ నేపథ్యంలో అధిక సంఖ్యలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా పది ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రైల్‌ సర్వీసులు జనవరి 5 నుంచి ఫిబ్రవరి 1 వరకు టైమ్‌టేబుల్‌ వారీగా రాకపోకలు కొనసాగిస్తాయని వెల్లడించారు. తిరుపతి-అకోలా, పూర్ణ-తిరుపతి, హైదరాబాద్‌-నర్సాపూర్‌, తిరుపతి-సికింద్రాబాద్‌, కాకినాడటౌన్‌-లింగంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

సంక్రాంతి పండగ సందర్భంగా కాచిగూడ-కాకినాడటౌన్‌, హైదరాబాద్‌-తిరుపతి రైల్వే స్టేషన్ల మధ్య 20 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఇందుకు సంబంధించిన పూర్తి రైళ్ల వివరాలు ఎస్‌సీఆర్‌ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. డిసెంబర్‌ 28 నుంచి జనవరి 26వరకు వివిధ తేదీల్లో ఈ రైళ్లు రాకపోకలు కొనసాగించనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లన్నింటిలోనూ ఫస్ట్‌ ఏసీ, సెకెండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీతో పాటు స్లీపర్‌, జనరల్‌ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.




Updated : 22 Dec 2023 4:00 AM GMT
Tags:    
Next Story
Share it
Top