Home > జాతీయం > ప్రధానికి 25 ఎకరాలు ఇస్తానంటున్న వందేళ్ల వృద్ధురాలు

ప్రధానికి 25 ఎకరాలు ఇస్తానంటున్న వందేళ్ల వృద్ధురాలు

ప్రధానికి 25 ఎకరాలు ఇస్తానంటున్న వందేళ్ల వృద్ధురాలు
X

14 మంది సంతానం ఉన్న ఆ వృద్ధురాలు.. ప్రధాని నరేంద్ర మోడీని తన 15వ కొడుకుగా భావిస్తానంటోంది. తన 25 ఎకరాల ఆస్తిని మోదీ పేరు మీద రాసిస్తానని చెబుతోంది. మోదీపై అంత అభిమానం పెంచుకోవడానికి గల కారణాన్ని వివరిస్తూ.. చివరి దశలో తనకు తిండి పెడుతున్నాడని, డబ్బులు పంపుతున్నాడని తెలిపింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్​కు చెందిన మంగీభాయి తన్వర్​ అనే ఆ వృద్ధురాలు.. రాజ్​గఢ్ జిల్లాకు 65 కిలోమీటర్ల దూరంలో హరిపుర గ్రామంలో నివసిస్తోంది.





ఆమెకు 14 మంది సంతానం. ప్రధాని నరేంద్ర మోదీ.. దేశానికి ఎంతో సేవ చేస్తున్నారని, అలాగే తనకు కూడా ఎన్నో పథకాలు అందిస్తున్నారని మంగీభాయి తెలిపింది. తనకు ఇల్లు ఇచ్చి.. ఉచితంగా వైద్యం అందిస్తున్నారని చెప్పింది. వితంతు పెన్షన్ ఇచ్చి ఆర్థిక స్తోమత కల్పిస్తున్నారని చెబుతూ.. తన 15 వ కొడుకు వల్లే తీర్థయాత్రలకు వెళ్లగలిగానని తెలిపింది. తనతో పాటు దేశంలోని ఎందరో వృద్ధుల అవసరాలు మోదీ తీరుస్తున్నారని , . అందుకే మోదీని తన 15వ కుమారుడిగా భావిస్తూ.. తన 25 ఎకరాల ఆస్తిని ప్రధాని పేరున రాసి ఇవ్వనున్నట్లు మంగీభాయి స్పష్టం చేసింది. ఇప్పటివరకూ మోదీని టీవీలోనే చూశానని, అవకాశం ఉంటే స్వయంగా మోదీని కలవాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టింది.





Updated : 27 Jun 2023 9:29 AM IST
Tags:    
Next Story
Share it
Top