హైదారాబాద్, నెల్లూరులో తనిఖీలు..10కిలోల బంగారం పట్టివేత
X
హైదరాబాద్, నెల్లూరు జిల్లాల్లో భారీగా బంగారం పటుబడ్డింది. మొత్తం 10.27 కిలోల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో టోల్ గేట్ వైపు వచ్చిన కారును తనిఖీ చేయగా.. సీటు కింద దాచి అక్రమంగా తరలిస్తున్న 7.798 కిలోల విదేశీ బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించి..హైదరాబాద్లో మరోచోట అక్రమ బంగారం ఉన్నట్లు తెలుసుకున్నారు. వెంటనే మరో బృందం ఆ ప్రాంతానికి చేరుకొని 2.471 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన డీఆర్ఐ అధికారులు.. బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు క్యారియర్లు, ఒక రిసీవర్ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు.